»   » అజయ్ దేవగన్ హిందీ ఘర్షణ

అజయ్ దేవగన్ హిందీ ఘర్షణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాదిన హిట్టయిన సినిమాలను బాలీవుడ్ లో జోరుగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పోకిరి, రెడీ, సింగమ్ తదితర దక్షిణాది హిట్ సినిమాలు ఇప్పటికే బాలీవుడ్ లో సంచలన విజయం సాధించాయి. బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ అయితే వరుసగా దక్షిణాది సినిమాల్లో నటిస్తూ హిట్టమీద హిట్లు కొడుతున్నాడు. ఈ నేపథ్యంలో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా దక్షిణాది సినిమాలపై కన్నేశారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ వరుస రీమేక్ లకు రీమేక్ చుట్టారు. ఇప్పటికే దక్షిణాది సింగం(తెగులో యముడు) సినిమా ద్వారా సూపర్ హిట్ సాధించిన అజయ్, ఇదే ఊపుతో గతంలో తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన ఘర్షణ సినిమా రీమేక్ చేసి మరో హిట్ కొట్టాలని ఉవ్విల్లూరుతున్నారు.

వాస్తవానికి 1988లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం 'అగ్ని నక్షత్రం" సినిమానే తెలుగులో వెంకీ హీరోగా 'ఘర్షణ" పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా దక్షిణాది ప్రక్షకులను చాలా ఆకట్టుకుంది. గత కొంత కాలంగా ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచి కూడా దక్షిణాది వారితో మ్యాచ్ అవుతూ ఉండటంతో ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆవిస్తున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. అజయ్ దేవగన్ హీరోగా నటించబోయే ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్ టాక్. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

English summary
Venkatesh starred Gharshana movie is very big hit in south. Ajay Devgan's team has been keeping track of its response. With him showing interest in ‘Gharshana’, a team is already in primary talks with its makers.
Please Wait while comments are loading...