ఆ రీమేక్ లో చేయాలని అఖిల్ నిర్ణయం
హైదరాబాద్ : అక్కినేని వారసుడు అఖిల్ తన తొలి చిత్రం అఖిల్ డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆయన తన తదుపరి చిత్రం విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రకరకాల కథలు విన్నా ఏదీ నచ్చటం లేదని సమాచారం. ఈ నేపధ్యంలో ఆయన ఓ హిందీ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రీమేక్ అయితే సేఫ్ జోన్ లో హిట్ కొట్టవచ్చనే ఈ నిర్ణయానికి వచ్చాడంటున్నారు.
ఆ రీమేక్ కోసం ఎంచుకున్న చిత్రం మరేదో కాదు... రెండేళ్ల కిందట బాలీవుడ్‌లో హిట్ కొట్టిన 'యే జవానీ హై దివానీ' అని తెలుస్తోంది. ఈ సినిమా చాలా కాలం క్రితమే చూసినా అప్పట్లో తనకు బాగా నచ్చిందని, ఆ రీమేక్ తో నే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వమని ఆయన ఫ్రెండ్స్ అన్నారని,అయితే అది పట్టించుకోని అఖిల్ ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుని హిట్ కొట్టబోతున్నట్లు చెప్తున్నారు.

ధర్మా ప్రొడక్షన్స్- అన్నపూర్ణ స్టూడియోస్ దీన్ని కంబైన్డ్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. కరుణ్ జోహార్ సైతం ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తి చూపెండుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాని వంశీపైడిపల్లి డైరెక్ట్ చేసే ఛాన్స్ వుంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి..నాగార్జున తో ఊపిరి చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం కూడా ప్రెంచ్ చిత్రం రీమేక్ కావటంతో నాగ్..ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్తున్న్రారు.


Click it and Unblock the Notifications











