అఖిల్ కూడా మొదలెట్టేస్తున్నాడు.. 'ఏజెంట్'గా రచ్చ అప్పుడే?
అక్కినేని అఖిల్ నాగార్జున సినీ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొట్టమొదటి సినిమా సిసింద్రీతో సూపర్ హిట్ అందుకున్న అఖిల్ హీరోగా మారాక మాత్రం ఒక్క సినిమాతో కూడా హిట్ కొట్టలేకపోతున్నాడు. సిసింద్రీ తర్వాత అఖిల్ మనం అనే సినిమాలో ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా కావడంతో పాటు నాగ చైతన్య, నాగార్జున కూడా నటిస్తుండడంతో ఈ సినిమాలో అఖిల్ కూడా క్లైమాక్స్ లో చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత అఖిల్ అనే సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఇచ్చాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఆ సినిమా కలిసి రాకపోవడంతో సంవత్సరం గ్యాప్ తీసుకుని మరీ హలో అనే సినిమా చేశారు. అయితే ఈ సినిమా కూడా హిట్ దక్కించుకోలేకపోయింది. దీంతో మళ్లీ సంవత్సరం గ్యాప్ తీసుకుని యువ దర్శకుడు వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను అనే సినిమా చేశారు. అనూహ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ దెబ్బతో అఖిల్ సినిమాల ఎంపిక మీద ద్రుష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన మంచి కధలను ఎంపిక చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఆయన ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ కూడా పెట్టినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా షూట్ కూడా మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. తాజా సమాచారం ఏమిటంటే #Agent షూట్ ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతుంది. అఖిల్ అక్కినేని ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్ హీరోలా కనిపించబోతున్నాడు. భారతదేశంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తరువాత, యూనిట్ ఫారిన్ షూట్‌కు వెళ్తుందని అంటున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటించబోతున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











