»   » వెంకటేశ్ కూతురితో అఖిల్ పెళ్లట.. మెగా బ్రదర్ డాటర్ మాదిరిగానే..

వెంకటేశ్ కూతురితో అఖిల్ పెళ్లట.. మెగా బ్రదర్ డాటర్ మాదిరిగానే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నటవరసుడు అఖిల్ అక్కినేనిని పెళ్లి రూమర్లు గత కొద్దికాలంగా వెంటాడుతూనే ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జీవికే మనువరాలు శ్రీయా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యాక అఖిల్ తన పనేదో తాను చూసుకొంటూ బుద్ధిగా ఉంటున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కెరీర్‌పైనే దృష్టిపెట్టాడు. ఇలాంటి నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్ కూతురితో అఖిల్ వివాహం అంటూ ఓ వార్త ఇంటర్నెట్‌లో చెలరేగిపోవడం గమనార్హం. అసలు వివరాల్లోకి వెళితే..

దగ్గుబాటి కుటుంబంతో అక్కినేని ఫ్యామిలీ..

దగ్గుబాటి కుటుంబంతో అక్కినేని ఫ్యామిలీ..

దగ్గుబాటి కుటుంబంతో అక్కినేని కుటుంబం వియ్యం అందుకోబోతున్నదంటూ వచ్చిన వార్తలపై ఇరు కుటుంబాల సభ్యులు కంగారుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు అందుబాటులో ఉన్న మీడియాతో మాట్లాడి ఈ వార్తలో వాస్తవం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు.

Akkineni Akhil sensational tweet on Actor Nani
అఖిల్‌ గురించి ఇలాంటి వార్తలు రాయొద్దు

అఖిల్‌ గురించి ఇలాంటి వార్తలు రాయొద్దు

ప్రస్తుతం అఖిల్ పూర్తి స్థాయిలో కెరీర్‌పై దృష్టిపెట్టారు. ఇలాంటి కథనాలు రాసి ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి వార్తలు ఇరు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి సున్నిత విషయాల ఆధారంగా చేసుకొని గాసిప్స్ రాయవద్దు అని ఇరు కుటుంబాల వారు మీడియాకు సూచించినట్టు సమాచారం.

ప్రస్తుతం కెరీర్‌పైనే అఖిల్ దృష్టి

ప్రస్తుతం కెరీర్‌పైనే అఖిల్ దృష్టి

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రానికే సమయాన్ని పూర్తిగా కేటాయిస్తున్నారు. ఇలా తన మానాన తాను బతుకుతుంటే తాజాగా మరోసారి అఖిల్‌ను పెళ్లి వార్తలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈసారి ఏకంగా విక్టరీ వెంకటేశ్‌తో పెళ్లి అంటూ గాసిప్స్ మీడియాలో చెలరేగాయి.

అఖిల్ పెళ్లి రూమర్ మీడియాలో సంచలనం

అఖిల్ పెళ్లి రూమర్ మీడియాలో సంచలనం

ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వార్త సారాంశం ఏమిటంటే.. వెంకటేశ్‌ కూతురితో అఖిల్ వివాహం ఖాయమైంది. చైతన్య, సమంత పెళ్లికి ముందు గానీ, లేదా ఆ తర్వాత గానీ పెళ్లి జరిపించడానికి నాగార్జున ప్రయత్నిస్తున్నాడు అని కథనంలో పేర్కొన్నారు. ఈ వార్త ఇంటర్నెట్ ప్రసార మాధ్యమాల్లో సంచలనంగా మారింది.

మెగా బ్రదర్ కూతురితో సాయిధరమ్ తేజ్

మెగా బ్రదర్ కూతురితో సాయిధరమ్ తేజ్

గతంలో కూడా మెగా బ్రదర్ నాగబాబు కూతురి వివాహం మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్‌తో జరుగునున్నదనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేయడంతో ఆ పెళ్లి వార్తలో వాస్తవం లేదని తేలిపోయింది. ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుట్టిస్తారో ఏమో అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.

English summary
Once again Akhil Akkineni marriage news goes viral in the media. According to reports, Akhil marriage confirmed with Venkatesh daughter. Nagarjuna making plans for before or After Naga Chaitanya, Samantha marriage. But both Daggubati, Akkhineni family condemns this gossip. Cleared the air that no fact in this news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X