»   »  రొమాంటిక్‌గా అఖిల్ రెండో లవ్ స్టోరీ.. ఎంగేజ్‌మెంట్ బ్రేక్ తర్వాత..

రొమాంటిక్‌గా అఖిల్ రెండో లవ్ స్టోరీ.. ఎంగేజ్‌మెంట్ బ్రేక్ తర్వాత..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నటవారసుడు అఖిల్‌కు గతేడాది అంతా చేదు అనుభవాలే మిగిలాయి. అఖిల్ చిత్రం ద్వారా విభిన్నమైన కథతో సినీ రంగం ప్రవేశం చేసిన అఖిల్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అఖిల్ చిత్రాన్ని విజయవంతంగా మలచడానికి దర్శకుడు వీవీ వినాయక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దాంతో అటు కెరీర్ పరంగానూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ అఖిల్ అటుపోట్లను ఎదుర్కొన్నాడు. తన కుమారుడి ఎంట్రీపై పెద్దగా ఆసక్తి చూపలేకపోయిన టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం పుత్రుల కెరీర్‌ను చక్కబెట్టే బాధ్యతను భుజాన ఎత్తుకొన్న సంగతి తెలిసిందే.

మనం డైరెక్టర్ విక్రమ్‌తో అఖిల్ రెండో సినిమా

మనం డైరెక్టర్ విక్రమ్‌తో అఖిల్ రెండో సినిమా

అఖిల్ నటించిన తొలి చిత్రం 'అఖిల్' దారుణంగా పరాజయం పొందడంతో తదుపరి సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు అక్కినేని నాగార్జున. కథ, కథనాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకొన్నట్టు సమాచారం. మనం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకొన్నారు.

రూట్ మార్చిన విక్రమ్ కుమార్

రూట్ మార్చిన విక్రమ్ కుమార్

లవ్ అండ్ ఫ్యామిలీ చిత్రాలను రూపొందించగలరనే పేరు ఉన్న విక్రమ్ కే కుమార్ ఈసారి రూట్ మార్చుకొన్నట్టు తెలుస్తున్నది. అఖిల్‌తో రూపొందించే చిత్రం పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ అనే వార్త సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ తొలిసారి తన జోనర్‌ను మార్చుకొని యాక్షన్‌ను ఎన్నుకున్నారనే ప్రచారం ఊపందుకున్నది.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..

పక్కా ప్లాన్ ప్రకారం సెట్స్ పైకి తీసుకొళ్లి కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇంకా పేరు పెట్టని చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్లను రంగంలోకి దించారు. తొలి షెడ్యూల్ కోసం దాదాపు రూ. 12 కోట్లపైగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తున్నది.

విక్రమ్ సినిమా పూర్తిస్థాయి లవ్‌స్టోరీ

విక్రమ్ సినిమా పూర్తిస్థాయి లవ్‌స్టోరీ

అఖిల్ ఇటీవల ఈ చిత్రంపై పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చాడు. నా రెండో చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ. అంతేకాకుండా ఈ సినిమా విక్రమ్ స్టయిల్‌లో ఉండే ప్రయోగాత్మక సినిమా అని అఖిల్ పేర్కొన్నాడు. యాక్షన్ ఒక పార్ట్ ఈ సినిమాలో ఓ భాగంమాత్రమే అని అన్నారు.

క్లైమాక్స్ అదిరిపోతుంది...

క్లైమాక్స్ అదిరిపోతుంది...

నా రెండో చిత్రంలో క్లైమాక్స్ సీన్లు చాలా కొత్తగా ఉంటాయి. సినిమాలో మానవ సంబంధాలను కొత్త తరహాలో ఆవిష్కరించనున్నాం. విక్రమ్‌తో మరోసారి కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. తన తొలి చిత్రం మాదిరిగా కాకుండా రెండో చిత్రం ప్రేమ కథ అని, ఈ చిత్రం తప్పుకుండా ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి గురిచేస్తుందని అఖిల్ పేర్కొనడం గమనార్హం.

అఖిల్ తల్లిగా టబూ?

అఖిల్ తల్లిగా టబూ?

అఖిల్ రెండో చిత్రానికి అనేక విశేషాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అఖిల్‌కు తల్లిగా గ్లామర్ డాల్ టబూ నటించనున్నారనే ప్రచారం ఫిలింనగర్‌లో సాగుతున్నది. గతంలో అఖిల్‌కు అమ్మగా శ్రీదేవి నటిస్తున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. అవన్నీ గాసిప్స్ అనే విషయం తేలిపోయింది. కానీ టబూ నటించే విషయంపై ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిజంగానే ఆమె నటిస్తుందా లేక
ఇది మరో రకమైన రూమరా అనేది తేలడం లేదు.

నిశ్చితార్తం బ్రేక్ తర్వాత ..

నిశ్చితార్తం బ్రేక్ తర్వాత ..

ఈ ఏడాది తొలి భాగం అఖిల్‌కు అంతా ఎదురుదెబ్బలే తగిలాయి. ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రీయా భూపాల్‌ల నిశ్చితార్థం ఊహించని విధంగా రద్దు కావడం అఖిల్‌ షాక్ గురయ్యాడు. ఇప్పుడిప్పుడే ఆ ఘటన నుంచి బయటపడి కెరీర్‌పై దృష్టి సారించాడు. ప్రస్తుతం విక్రమ్ సినిమాపైనే ఆశలు పెట్టుకొని ముందుకెళ్తున్నాడనేది తాజా సమాచారం.

English summary
Actor Akhil Akkineni is gearing up with second movie. Manam movie fame Vikram K Kumar is the director for this unnamed movie. Akhil cleared the air that This movie is not action entertainer. This purely love story. Action is only part of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu