twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ సినిమా ...ఆఫ్రికా అడవికీ లింక్

    By Srikanya
    |

    హైదరాబాద్: అఖిల్, వివి వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మేజర్ పార్ట్ అడవి నేపధ్యంలో జరుగుతుందని తెలుస్తోంది. దాంతో చిత్రంలోని కొన్ని కీ సీన్స్...సౌత్ ఆఫ్రికా అడవులలో షూటింగ్ జరుగనుందని సమాచారం. మిగతా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో జరగుతుందని తెలుస్తోంది.

    వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటివలే కంప్లీట్ అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలలో హీరో అఖిల్ పై ఇంట్రడక్షన్ ఫైట్ చిత్రీకరించారు.

    ‘ఫస్ట్ షెడ్యూల్ వాజ్ అమైజింగ్ ఎక్స్ పీరియన్స్. అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్ తీసిన స్టంట్ మాస్టర్ రవి వర్మకు థాంక్స్ చెప్పాల్సిందే. సం అమైజింగ్ ఫుటేజ్.' అని అఖిల్ ట్వీట్ చేశారు.

    అఖిల్ సరసన సాయేష సైగల్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందించగా కోన వెంకట్ మాటలు రాస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువహీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులు. ఈ సినిమాపై అక్కినేని అభిమానులలో అంచనాలు బాగున్నాయి.

    Akhil Akkineni's Film at South Africa.
    అఖిల్‌ సరసన సాయేషా సైగల్‌ నటిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకుడు. ఈ చిత్రంలో అఖిల్‌ తండ్రి పాత్ర కోసం రాజేంద్రప్రసాద్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సుధాకర్‌ రెడ్డి, నితిన్‌ నిర్మాతలు.

    మనం సినిమాతో అఖిల్‌ను పరిచయం చేయాలనే ఆలోచన నాన్నగారిదే. తను ఎక్కువ రోజులు బతకననే నాన్న ఉద్ధేశ్యంతోనే అఖిల్ అరంగేట్రం ఆలోచన పుట్టింది.ఇలాంటి శుభతరుణంలో ఆయన మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం అని అన్నారు నాగార్జున.

    వివి వినాయిక్ మాట్లాడుతూ...''నాగార్జునగారు నాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా. 'మనం'లో అఖిల్‌ను చూడగానే అందరిలా నేనూ షాక్‌కు గురయ్యా. అంత బాగా నచ్చేశాడు. ఎంత నచ్చాడో ఈ చిత్రంలో చూపిస్తాను.వంద శాతం కష్టపడే సాంకేతిక బృందం కుదిరింది. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా అఖిల్‌ను తెరపై చూపిస్తానని మాటిస్తున్నాను''అన్నారు వి.వి.వినాయక్‌.


    వెంకటేష్‌ మాట్లాడుతూ... ''అఖిల్‌ రూపంలో ఒక కొత్త స్టార్‌ రాబోతున్నాడు. ఇక అక్కినేని అభిమానులకు పండగే. అఖిల్‌ ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాడు. వినాయక్‌ దర్శకత్వంలో తెరంగేట్రం అవ్వడం ఆనందంగా ఉంది''అన్నారు.

    కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ... ''విక్టరీ మధుసూదనరావుగారి చేతుల మీదుగా తెరకు పరిచయమయ్యారు నాగార్జున. ఒక 'వి' ఉన్న దర్శకుడి చేతులమీదుగా పరిచయమైన నాగార్జున మంచి పేరు తెచ్చుకొన్నాడు. మూడు 'వి'లు ఉన్న వినాయక్‌ చేతులమీదుగా పరిచయమవుతున్న అఖిల్‌ మరింత పేరు తెచ్చుకొంటాడు''అన్నారు.

    నాగచైతన్య మాట్లాడుతూ... ''ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా. సినిమా అంటే అఖిల్‌కు ప్రాణం. తాను చేసే ప్రతి సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందన్న నమ్మకముంది. దేశంలోని సినిమా అభిమానులందరినీ ఆకట్టుకొంటాడన్న నమ్మకముంది''అన్నారు.

    నితిన్‌ మాట్లాడుతూ... ''ప్రతిష్ఠాత్మకమైన ఈ సినిమాకు నేను నిర్మాత కావడం ఆనందంగా ఉంది. నాగార్జునగారు మాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నెరవేర్చుతాం. ఆయన చేసిన ప్రేమకథా చిత్రాలు 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా'.. మాస్‌ సినిమాలు 'శివ', 'మాస్‌' కలిపితే ఎలా ఉంటుందో అఖిల్‌ చేసే ఈ సినిమా అలా ఉంటుంది''అన్నారు.

    నాగార్జున మాట్లాడుతూ...''అఖిల్‌ను 'మనం' రూపంలో నాన్న ఆశీర్వదించారు. అఖిల్‌కు సూపర్‌ హిట్‌ సినిమా ఇస్తామని వినాయక్‌, నితిన్‌ మాటిచ్చారు. ఈ కథ నేనూ విన్నాను. చాలామంది ఇదొక ప్రేమకథ అనుకొంటున్నారు. అది నిజం కాదు. సినిమా నిండా మాస్‌ అంశాలు ఉన్నాయి''అన్నారు నాగార్జున.

    అమల మాట్లాడుతూ....''అందరిలాగే అఖిల్‌ సినిమా గురించి నేనూ ఎదురు చూస్తున్నా. మా అబ్బాయిని అభిమానుల చేతుల్లో పెడుతున్నాను''అన్నారు.

    అఖిల్‌ మాట్లాడుతూ.... ''ఈ సమయంలో తాతగారు ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఆయన అభిమానుల్లోనే దేవుడిని చూసుకొనేవారు. అభిమానులు ఎంతో ఇస్తారు. మేం తిరిగి వాళ్లకు హిట్‌ సినిమా తప్ప ఏం ఇవ్వగలం. ఎలాగైనా హిట్‌ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకొన్నా. దాని గురించే ఆలోచిస్తూ నాన్నను అడిగేవాణ్ని. అప్పుడు చీకట్లో ఉన్న నాకు ఒక సెర్చ్‌లైట్‌లా కనిపించారు వి.వి.వినాయక్‌గారు. ఇలాంటి సినిమాకు వినాయక్‌గారే దర్శకత్వం వహించాలని నాకనిపించింది.

    అలాగే...కేవలం అభిమానుల కోసమే తొలి సినిమా చేయాలని నితిన్‌ చెబుతూ ఉండేవాడు. ఆయన నా సినిమాకు నిర్మాత కావడం ఆనందాన్నిచ్చింది. ఇందులో యాక్షన్‌, డ్యాన్స్‌ అన్నీ కొత్తగా ఉంటాయి. మూడు నాలుగేళ్లుగా డ్యాన్స్‌ నేర్చుకుంటున్నా. అందరికీ నచ్చేలా తెరపై కనిపిస్తా. ఈ సినిమాకు తమన్‌, అనూప్‌ రూబెన్స్‌ కలసి సంగీతం అందిస్తారు''అన్నారు.

    నేను ఈ స్థాయికి చేరుకోవటానికి అమ్మనాన్నలే ముఖ్య కారణం. అన్నయ్య నాగచైతన్య ఇంత ఎమోషనల్ మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి ఓ పెద్ద మల్టీస్టారర్ సినిమా చేస్తాం అన్నారు అఖిల్.

    English summary
    We are talking about Akhil's debut flick some key sequences would be canned in the real time forests based at South Africa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X