»   » అఖిల్ పెళ్ళీ ఇటలీలోనా..!? ప్రపంచ ధనవంతుల పెళ్ళి తరహాలో "డెస్టినేషన్ మ్యారేజ్" ....

అఖిల్ పెళ్ళీ ఇటలీలోనా..!? ప్రపంచ ధనవంతుల పెళ్ళి తరహాలో "డెస్టినేషన్ మ్యారేజ్" ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

చైతూ సమంతల పెళ్ళికన్నా ముందుగానే అఖిల్ పెళ్ళి జరుగుతుంది అన్న సంకేతాలు ఇప్పటికే చైతన్య లీకులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ లీకులకు మరింత బలం చేకూర్చే విధంగా అఖిల్ పెళ్ళి ఏర్పాట్లకు సంబంధించి అప్పుడే అక్కినేని కాంపౌండ్ లో కొన్ని ప్రాధమిక చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్ల లవ్‌కి పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో మిగతా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి ఇరు కుటుంబాలు. వచ్చేఏడాది సమ్మర్‌లో మ్యారేజ్‌కి ప్లాన్ చేస్తున్నాయి. ఐతే, వివాహం ఇక్కడ? అనేది ప్రస్తుతానికి కన్య్ఫూజన్. నార్మల్‌గా ఇక్కడ చేస్తే బాగుంటుందని నాగ్ ఫ్యామిలీ భావిస్తుంటే..

ఘనంగా చేయాలన్నది భూపాల్ ఫ్యామిలీ ఆలోచన. అమ్మాయి కుటుంబం మాత్రం డెస్టినేషన్ వెడ్డింగ్‌కే ప్రిపేర్ అయినట్టు సమాచారం. కుర్రాళ్ల ఆలోచనకు ఈ పద్దతి బాగుంటుందని అంటున్నారట. యూరప్‌లోని ఇటలీ రాజధాని రోమ్ అయితే బాగుంటుందని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇరు కుటుంబాలు చర్చల్లో నిమగ్నమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ రోమ్‌లో మ్యారేజ్ వుంటే ఇక్కడ నుంచి దాదాపు 600 మంది గెస్టులు హాజరవుతారనే అంచనా వేస్తున్నారట. మొత్తానికి వెడ్డింగ్ ఎక్కడా అనేది వచ్చేవారంలో కొలిక్కిరానుందని ఇన్‌సైడ్ సమాచారం. ఈ పెళ్ళి గురించిన మరికొన్ని విశేషాలు...

ప్యాష‌న్ డిజైన‌ర్ శ్రీయా భూపాల్‌:

ప్యాష‌న్ డిజైన‌ర్ శ్రీయా భూపాల్‌:

నాగ చైతన్య ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే తమ్ముడు అఖిల్ ఇచ్చిన షాక్ కి అందరికీ దిమ్మ తిరిగి పోయింది. అఖిల్ ప్రేమాయ‌ణం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ ప్రేమ‌లో ప‌డింది పాపుల‌ర్ ప్యాష‌న్ డిజైన‌ర్ శ్రీయా భూపాల్‌తోన‌ని సోష‌ల్ వెబ్‌సైట్ల‌లో ప్ర‌చారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో శ్రియా బాగా పాపుల‌ర్. ఆమెకు సినిమా ఇండ‌స్ట్రీతో సంబంధం లేక‌పోయినా ఫ్యాష‌న్ డిజైన‌ర్ కావ‌డంతో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌కు ఆమె ప్యాష‌న్ డిజైన‌ర్‌గా వ్యవహరిస్తుందట.

అఖిల్ లవ్ విషయం:

అఖిల్ లవ్ విషయం:

కాగా వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఈ మధ్య కాలంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అఖిల్ కూడా తాను ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకోవడమే ఇందుకు కారణం. అఖిల్ తాను ప్రేమలో పడినట్టు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆమె వివరాలు బయటకు లీక్ అయ్యాయి. నాగార్జున కూడా వీరి ప్రేమను అంగీకరించడంతో అఖిల్ లవ్ విషయంలో మరింత బలం చేకూరింది.

తాము ప్రేమించిన అమ్మాయిలనే :

తాము ప్రేమించిన అమ్మాయిలనే :

కింగ్ నాగార్జున ఇద్దరు అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయిలనే పెళ్లి చేసుకుంటాం అని చెప్పడం.. నాగార్జున కూడా వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎప్పుడో జరిగిపోయింది. నాగ చైతన్య సమంత ని ప్రేమించగా, మన సిసింద్రీ శ్రియ భూపాల్ తో ప్రేమలో ఉన్నాడు. దింతో అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో అని తెలుసుకునే ప్రయత్నం చేసిన టాలీవుడ్ వర్గాలకు ఊహించని షాక్ తగిలింది.

జి.వి.కే. గ్రూప్ అధినేత జి.వి. కృష్ణ రెడ్డి:

జి.వి.కే. గ్రూప్ అధినేత జి.వి. కృష్ణ రెడ్డి:

అఖిల్ ప్రేమించిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఒక్క సారిగా కంగుతిన్నారు. ఎందుకంటె ఆ అమ్మాయి మరెవరో కాదు.. జి.వి.కే. గ్రూప్ అధినేత జి.వి. కృష్ణ రెడ్డి ముద్దుల మనవరాలు. జి.వి.కే. పేరు తెలియని వారుండరు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమయిన ఈ సంస్థ అనతికాలంలోనే ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. భారత దేశంలోని మొదటి 100 మంది ధనికుల జాబితాలో జి.వి. కృష్ణ రెడ్డి ( జి.వి.కే. రెడ్డి) ఒకరు.

డెస్టినేషన్ వెడ్డింగ్‌:

డెస్టినేషన్ వెడ్డింగ్‌:

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం అఖిల్ - శ్రియాభూపాల్‌ ల మ్యారేజ్ హంగామా ఏ విధంగా చేయాలి అన్న విషయమై అఖిల్ శ్రియా భూపాల్ ల కుటుంబ సభ్యులు ఇప్పటికే కొన్ని ఆలోచనలు చేసినట్లు టాక్. ఈ ఆలోచనల మధ్య వీరు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు నాగ్ ఫ్యామిలీ అఖిల్ పెళ్లిని భాగ్యనగరంలో చేయాలని ఆలోచిస్తూ ఉంటే శ్రియా భూపాల్ కుటుంబ సభ్యులు మాత్రం డెస్టినేషన్ వెడ్డింగ్‌కే ప్రిపేర్ అయినట్టు సమాచారం.

 రోమ్‌లో మ్యారేజ్:

రోమ్‌లో మ్యారేజ్:

ఈమధ్య కాలంలో ఉన్నత కుటుంబాలకు చెందిన యూత్ డెస్టినేషన్ వెడ్డింగ్ లకు మోజు పడుతున్న నేపధ్యంలో అఖిల్ పెళ్ళి కూడ ఈతరహాలోనే జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆలోచనలకు అనుగుణంగా అఖిల్ శ్రియాభూపాల్ ల పెళ్ళికి యూరప్‌లోని ఇటలీ రాజధాని రోమ్ అయితే బాగుంటుందని ఈ ఇరు కుటుంబ సభ్యులు ఒక ప్రాధమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ రోమ్‌లో మ్యారేజ్ ఉంటే వీరి పెళ్ళికి భాగ్యనగరం నుండి ఇరు కుటుంబాలకు చెందిన దాదాపు 600 మంది గెస్టులు హాజరవుతారనే అంచనా వేస్తున్నారట.

ఎంగేజ్ మెంట్ డిసెంబర్ లో :

ఎంగేజ్ మెంట్ డిసెంబర్ లో :

ఈ పెళ్ళి తంతు పూర్తి అయిన తరువాత అక్కినేని కుటుంబం అఖిల్ శ్రియా లతో కలిపి ఒక భారీ రిసేప్క్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇవ్వబోతున్నట్లు కూడ వార్తలు వస్తున్నాయి. మరి కొద్ది రోజులలోనే ఈ పెళ్ళి వేడుకకు సంబంధించిన ఏర్పాట్ల విషయమై ఒక క్లారిటీ వచ్చిన తరువాత అఖిల్ శ్రియాల మ్యారేజ్ ఎంగేజ్ మెంట్ డిసెంబర్ లో ఉండబోతోంది అని టాక్. ఏది ఏమైనా చైతూ పెళ్ళి కన్నా అఖిల్ పెళ్ళి ముందుగా జరగడం ఖాయం అని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు..

దాదాపు 600 గెస్టులు:

దాదాపు 600 గెస్టులు:

అఖిల్ మరియు శ్రీయ భూపాల్ పెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ అని తెలుస్తోంది. అది కూడానూ ఇటలీ దేశంలో చేస్తున్నారట. ఇప్పటికే ఇటలీలో నేపుల్స్ అలాగే రోమ్ నగరాల్లో అనువైన ప్రదేశాలను వెడ్డింగ్ కోసం వెతకగా.. అందులో ఒక వెన్యూ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. బహుశా 2017 తొలి భాగంలో జరిగే ఈ పెళ్లి కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 గెస్టులు వస్తారని తెలుస్తోంది. వారందరికీ సెవెన్-స్టార్ ఆతిధ్యంతో పాటు.. ఇటలీలో నాలుగురోజుల పాటు గ్రాండ్ రిసప్షన్ హోస్ట చేయనున్నారు. ఇంతకీ డెస్టినేషన్‌ మ్యారేజ్‌ అంటే ఏమిటంటే... ఏదైనా దీవిలోగానీ, పెద్ద మహల్లోగానీ, నౌకలోగానీ వివాహం చేసుకోవడం. ముఖ్యులైనవారినే ఈ వేడుకకు ఆహ్వానిస్తుంటారు.

English summary
Catching up with the new trend of destination wedding, Akkineni family is all set to head for Italy trip in coming summer season for the marriage of Akkineni Akhil and fashion designer Shriya Bhupal. To everyone’s knowledge, Akhil and Shriya are in love from sometime and they shared the same with respective families few months back to get their nod.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu