»   » అక్కినేని అఖిల్ లాంచింగ్ చిత్రం కి ఆ స్టార్ డైరక్టర్ దర్శకత్వం

అక్కినేని అఖిల్ లాంచింగ్ చిత్రం కి ఆ స్టార్ డైరక్టర్ దర్శకత్వం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున, అమలల ముద్దుల కుమారుడు అక్కినేని అఖిల్ త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాగార్జున స్వయంగా రాజమౌళిని అడగటం, రాజమౌళి కూడా ఓకే చేసి రెండు స్టోరీ లైన్ లు వివరించటం జరిగిందని, అయితే ప్రాజెక్టు కన్ఫర్మ్ అయ్యేవరకు సీక్రెట్ గానే ఉంచాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. నాగాచైతన్యను కొత్త దర్శకుడు చేతిలో పెట్టి జోష్ వంటి ఫెయిల్యూర్ చిత్రంతో లాంచ్ చేయాల్సిరావటం గుర్తు చేసుకుని మరీ నాగార్జన అటువంటి పొరపాటు మళ్ళీ జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. ఇక అఖిల్ కూడా రాజమౌళికి వీరాభిమాని అని, పట్టుబట్టి మరీ తన తండ్రి చేత రాజమౌళికి ప్రపోజల్ పెట్టేలా చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అనుకున్నవన్నీ సరిగ్గా కుదిరితే..మరో రెండు నెలల్లో ఈ చిత్రానికి సంభందించిన వార్త వినే అవకాశఁ ఉంది. ఇక ప్రస్తుతం రాజమౌళి...ఈగ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu