»   » అఖిల్ మ్యారేజ్ కాన్సిల్: నాగ్ షాకిచ్చే ఈ నిర్ణయం తీసుకున్నారా, నమ్మచ్చా?

అఖిల్ మ్యారేజ్ కాన్సిల్: నాగ్ షాకిచ్చే ఈ నిర్ణయం తీసుకున్నారా, నమ్మచ్చా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని అఖిల్‌, శ్రీయ భూపాల్‌ల పెళ్లి క్యాన్సిల్‌ అయిందన్న వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా ఈ విషయమై ఖండనలు సైతం రాకపోవటంతో దాదాపు ఈ విషయం నిజమే అని అందరూ నమ్మే పరిస్దితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో రకరకాల రూమర్స్ మీడియాలో వినిపిస్తున్నాయి.

తాజాగా నాగార్జున తన ఫోన్ నెంబర్ మార్చారని చెప్పుకుంటున్నారు. మీడియా నుంచి , తన సన్నిహితుల నుంచి, పరామర్శ కాల్స్ నుంచి అసలేం జరిగిందనే ఎంక్వైరీ కాల్స్ ఇబ్బడి ముబ్బడిగా వస్తూండటంతో వేరే దారిలేక ఆ నిర్ణయం తీసుకున్నారని, ఈ ఇష్టూ చల్లారాక, తన పాత నెంబర్ ని యాక్టివేషన్ కు తెస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ విషయమై ఆయనకి ఎవరితోనూ డిస్కషన్ చేయటం ఇష్టం లేదని, అదే సమయంలో తను ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన నమో వెంకటేశాయ చిత్రం సైతం డిజాస్టర్ అవటం, ఆయన్ని కలిచి వేసిందని , దాంతో కొంతకాలం సైలెంట్ గా ఉండిపోవాలని నిర్ణయించుకుని, తన సన్నిహితులతో గడుపుతున్నట్లు చెప్తున్నారు. ఈ రూమర్స్ లాంటి వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Akhil Marriage Called Off:Nagarjuna Changes Phone Number?

ఇదిలా ఉంటే... అఖిల్, శ్రియ మధ్య బ్రేకప్‌ ఎప్పుడో జరిగిపోయిందని, మీడియాకే లేటుగా తెలిసిందని చెప్తున్నారు. మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట విడిపోవటానికి స్ఫష్టమైన కారణం తెలియరాలేదు కానీ చిన్న వివాదం ఈ బ్రేకప్ కు కారణమైందని తెలుస్తోంది.

అఖిల్‌, శ్రీయల మధ్య హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. రోమ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు నెల రోజుల క్రితం అఖిల్‌, శ్రీయ, ఆమె తల్లి బయల్దేరాట. అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే అఖిల్‌, శ్రీయల మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పుకుంటున్నారు.

అక్కడే బహిరంగంగా వాదనకు దిగారని చెప్తున్నారు. వాదన అనంతరం శ్రీయను, ఆమె తల్లిని అక్కడే వదిలేసి, గుడ్‌బై చెప్పేసి అఖిల్‌ ఇంటికి వెళ్లిపోయాడట. వారిద్దరూ అఖిల్‌ను వారించే ప్రయత్నం కూడా చేయలేదట. ఆ తర్వాత అఖిల్‌ను, శ్రీయను కలిపేందుకు నాగ్‌ ఎంతగా ప్రయత్నించినా కుదరలేదట. దీంతో చేసిది లేక నాగ్‌ సైలెంట్‌ అయిపోయాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా... ఈ పెళ్లి నాగార్జునకు మొదట్నుంచీ ఇష్టం లేదట. తన కన్నా చిన్న (అఖిల్ ఏజ్ 22 ఏళ్లు)లో, వయసులో పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్‌ కాదని అఖిల్‌కు నాగ్‌ ఎంతగానో నచ్చ చెప్పినా ఫలితం లేదుట. అంతేకాకుండా అఖిల్ సోదరుడు.... చైతన్య కూడా వారించాడట. అయినప్పటికీ అఖిల్‌ వినకుండా పట్టుపడ్డటంతో . ఓకే చెప్పేసిందట అక్కినేని కుటుంబం. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే సాగింది.

దాంతో అఖిల్‌ పెళ్లి రద్దు వార్త వినిపించడంతో ఏం జరిగి ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్‌, శ్రియ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనీ, డెస్టినేషన వెడ్డింగ్‌ ఏర్పాట్ల విషయంలో తేడాలొచ్చాయనీ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ వ్యవహారంతో నాగార్జున బాగా కలత చెందినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

ఈ విషయమై నాగార్జున చాలా ఫీలయ్యారని, వెంటనే తన పనులన్ని ప్రక్కన పెట్టిన ఆయన ...తమ రెండు కుటుంబాల పెద్దలు, అఖిల్, శ్రియ కూర్చొని మాట్లాడుకుని, సమస్యను పరిష్కరించుకుందామని అటు వైపు వారికి నాగార్జున సూచించారని తెలుస్తోంది. అయితే ..., అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు.

అఖిల్ సైతం ఊహించని ఈ సంఘటనపై చాలా బాధగా ఉన్నారని, ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని, బాగా సన్నిహితులు అనుకున్న స్నేహితులతో సైతం ఈ విషయం చర్చించటానికి ఇష్టపడటం లేదని సమాచారం. ముఖ్యంగా ఈ విషయమై రెండు కుటుంబాలలోని అధికారికంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. మీడియావారు ఈ విషయమై స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించినా అది సాద్యం కావటం లేదు. ఆంతరంగికంగా మాత్రం వివాహం రద్దు విషయాన్ని ఇరు కుటుంబాలూ తెలియజేస్తున్నాయి.

ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్‌తో 2016 డిసెంబర్‌లో అఖిల్‌ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తేదీ ప్రకటించకపోయినా.. ఈ వేసవిలోనే రోమ్‌(ఇటలీ)లో ఘనంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అతిథులకు టిక్కెట్లను కూడా బుక్‌ చేశారు. అయితే అనూహ్యంగా.. ఈ ఇలా రద్దైనట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
If the buzz from the filmy circles and Media is to be believed, Nagarjuna has changed his phone number as he has been receiving numerous calls regarding the reportedly called off Akhil’s marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu