»   » అఖిల్‌కు హీరోయిన్ దొరికినట్లుందే!

అఖిల్‌కు హీరోయిన్ దొరికినట్లుందే!

Subscribe to Filmibeat Telugu

అక్కినేని వారసుడు అఖిల్ మూడవ చిత్రాన్ని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన వెంకీ అట్లూరి దర్శత్వంలో అఖిల్ నటించబోతున్నాడు. అక్కినేని వారసుడిగా అఖిల్ 'అఖిల్' చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత హలొ చిత్రంతో మెప్పించాడు. కానీ ఈ రెండు చిత్రాలు కమెర్షియల్ గా నిరాశ పరిచాయి. మూడవ చిత్రంతో ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలని అఖిల్ పట్టుదలగా ఉన్నాడు.

అఖిల్ తన తొలి రెండు చిత్రాలలో కొత్త హీరోయిన్లతో రొమాన్స్ పండించాడు. ఈ చిత్రంలో మాత్రం పాపులర్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నాడట. లై, చల్ మోహన్ రంగ వంటి చిత్రాలతో యువతని ఆకర్షించిన మేఘా ఆకాష్ ని హీరోయిన్ గా ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. బివిఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత.

Akhil to romance with Megha Akash
English summary
Akhil to romance with Megha Akash.Venky Atluri directing this movie. Thaman is music director
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X