»   » లోఫర్ ..రోగ్.. తర్వాత అఖిల్

లోఫర్ ..రోగ్.. తర్వాత అఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగర్జున చిన్న కుమారుడు 'అఖిల్' తన తొలి సినిమా ఫ్లోప్ అవ్వడం, నిరాశకు గురైనట్టున్నారు.. అందుకు తన రెండో సినిమా కోసం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అయితే ఖచ్చితంగా మళ్లీ పెద్ద డైరక్టర్ తోనే సినిమా తీయలని, దీనికి త్రివిక్రమ్, కొరటాల శివ పేర్లు పరిశీలనలో ఉన్నా...వారు కొంచెం బిజిగా ఉండటంతో రూటు మార్చుకున్నారు.

పూరి జగన్నాధ్ విషయానికి వస్తే... లోఫర్ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉండగానే, తదుపరి సినిమా 'రోగ్' పూర్తికావచ్చింది. అందువలన పూరియే వారికి కావలసిన డైరక్టర్ అని అనుకుంటున్నారు. కాకపోతే డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న లోఫర్ రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడలని భావిస్తున్నట్టు సమాచారం. అంటే లోఫర్ ..హిట్టైతే అఖిల్ కు డైరక్టర్ దొరికేసినట్లే.

Akhil second movie will be directed by puri

ఇక తొలి సినిమాలో డాన్సులు, ఫైటింగులు, డైలాగులతో తనలోని ఆల్‌రౌండర్‌ని బయటకు తీసుకొచ్చాడు అఖిల్‌. ఆ సినిమా ఫలితం నిరాశ పరిచినా... అఖిల్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు రెండో సినిమాలో 'అంతకు మించి'న ప్రదర్శన ఇవ్వాలనుకొంటున్నాడట. అందుకే తన మైనస్సులను సరిచేసుకొనే పనిలో పడ్డాడని టాలీవుడ్‌ టాక్‌. కామెడీ పండించే విషయంలో అఖిల్‌ కాస్త మెరుగవ్వాల్సివుంది.

Akhil second movie will be directed by puri

అందుకే ఆ విషయంపై దృష్టి పెట్టాడట. అంతే కాదు, రెండో సినిమాలో సిక్స్‌ప్యాక్‌ చూపించాలనుకొంటున్నాడట. ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయని, ఓ ట్రైనర్‌ శిక్షణలో కండలు పెంచుతున్నాడని తెలుస్తోంది. మరోవైపు అఖిల్‌ రెండో సినిమా కోసం నాగార్జున కథలు వింటున్నారట. జనవరి నాటికి అఖిల్‌ రెండో సినిమాపై ఓ స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశంఉంది.

English summary
Puri Jagannath may direct Akhil's second film. But Nagarjuna is wait for the release of Varun Tej-Puri's Loafer which is releasing on Dec 17th before taking a decision.
Please Wait while comments are loading...