»   » 'ఆరడుగుల బుల్లెట్' టైటిల్ అక్కినేని హీరోకి?

'ఆరడుగుల బుల్లెట్' టైటిల్ అక్కినేని హీరోకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని పాటలోని 'ఆరడుగుల బుల్లెట్' టైటిల్ తో ఏ హీరో సినిమా చేస్తాడనేది అందరిలో చాలా సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ టైటిల్ ని అక్కినేని హీరో సుశాంత్ చిత్రానికి పెట్టనున్నారని సమాచారం. ఈ టైటిల్ పెట్టడంతో పవన్ బ్రాండ్ కూడా యాడ్ అవుతుందని భావిస్తున్నారు. 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ అధినేత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ 'ఆరడుగుల బుల్లెట్' టైటిల్‌గా ఫిల్మ్‌చాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. ఆయన నిర్మిస్తున్న తదుపరి చిత్రానికి ఆ టైటిల్ ని పరిశీలిసతున్నారని సినీ వర్గాల సమాచారం.

బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ... అత్తారింటికి దారేది తర్వాత మా బేనర్ లో వస్తున్న సినిమా ఇది. నాగేశ్వరరెడ్డి గారితో సినిమా చేద్దామని చాలా కాలంగా అనుకుంటున్నాం. ఆయన చెప్పిన కథ సుశాంత్ కి చాలా పర్ ఫెక్ట్ గా ఉంటుందనిపించింది. కాళిదాసు, కరెంట్, అడ్డా చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సుశాంత్ కి ఇది మంచి సినిమా అవుతుంది. త్వరలోనే మిగతా నటీనటుల,సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాయు. ఏప్రిల్ లోనే ఈ చిత్రానికి సంబందించిన నిర్మాణ కార్య్రకమాలు ప్రారంభమౌతాయి అన్నారు.

Akkineni hero gets ‘Aaradugula Bullet’

హీరో సుశాంత్ మాట్లాడుతూ... నా పుట్టిన రోజు ఈ వార్త ఓ ప్రత్యేక బహుమతిగా భావిస్తున్నాను. ఇంత వరకు శ్రీ నాగ్ కార్పోరేషన్ బేనర్ లోనే సినిమా చేశాను.బయటి బేనర్ లో చేయాలంటే ఓ పెద్ద బేనర్ లో చేయాలని నిరీక్షించాను. నేను నిరీక్షించినట్టుగానే ఒక పెద్ద బేనర్లో నటించే అవికాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నాగేశ్వరరెడ్డి గారి దర్శకత్వంలో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఈ సినిమా నా కెరియర్ కి పెద్ద చిత్రమవుతుంది అన్నారు.
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇది ఒక యూత్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్. సుశాంత్ ఇప్పటి వరకు లవ్ సినిమాలు చేశాడు. తొలి సారి అతని లో ఉన్న ఆల్ యాంగిల్స్ ని ప్రజెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అన్నారు.

కాళిదాసు,కరెంటు అడ్డా చిత్రాల హీరో సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా సుశాంత్ నటిచే కొత్త చిత్రం వివరాలను ప్రకటించారు. సుశాంత్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఓ భారీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతః బోగవల్లి బాపినీడు,నిర్మాత వి.వి.వి.ఎస్.ఎన్న ప్రసాద్ . కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

English summary

 Many expected that Aaru adugula bullet title will be used for Mega family hero Varun Tej but it fall into kitty of Akkineni hero Sushanth.Attarintiki Daredi producer BVSN Prasad is producing the flick under his SVCC banner
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu