»   » దసరా బరి నుండి తప్పుకున్న ‘అఖిల్’?

దసరా బరి నుండి తప్పుకున్న ‘అఖిల్’?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతున్న యంగ్ స్టార్ అఖిల్ అక్కినేని. వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ నటించిన ‘అఖిల్' మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 22న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో నితిన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. విడుదల వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

నాగార్జున, దర్శకుడు వినాయక్ ఈ సినిమాను దసరా బరిలో కాకుండా.... తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే నిర్మాత నితిన్ మాత్రం అక్టోబర్ 22నే విడుదల చేయాలని స్ట్రాంగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. విడుదల విషయమై నాగార్జున, వినాయక్, నితిన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.


ఆంధ్రప్రదేశ్ గవర్నెమంట్ దసరా హాలిడేస్ అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 23 వరకు ప్రకటించింది. ఈ ఫెస్టివల్ సీజన్ అఖిల్ లాంటి కొత్త హీరోలకు వర్కౌట్ కాదని భావిస్తున్నారట. మరో వైపు కొన్ని ఏరియాల్లో ప్రీ-రిలజ్ బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరుగలేదని సమాచారం.


Akkineni Scion's Akhil Out Of Dusshera Race?

మరో వైపు వివి వినాయక్ కూడా... రామ్ చరణ్ సినిమాతో పోటీ పడుతూ ‘అఖిల్'ను లాంచ్ చేయడం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాలు పరిశీలిస్తుంటే ‘అఖిల్' సినిమా అక్టోబర్ 22న విడుదలవ్వడం డౌటే అని అంటున్నారు. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.


అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.


ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
It is known that Akkineni Scion, Akhil is making a grand debut this Dusshera, under the star director V V Vinayak, produced by Nithin. However, according to the latest developments, Akhil, which is slated to release on 22 October might get postponed to a further date. Though it looked like everything is in place for Akhil, Nagarjuna and V V Vinayak are reportedly not in agreement to release the film in the Dusshera race, while Nithin strongly wants to release it on 22 October.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu