మలయాళీ ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ స్కెచ్.. ఇలా డిసైడ్ చేసేశారు!
సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఇతర సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో కూడా ఈ హీరోకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కొదవేలేదు. అందుకే ఆయన తాజా సినిమా అల.. వైకుంఠపురములో చిత్రాన్ని మలయాళం భాషలో "అంగు వైకుంఠపురత్తు" అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు.
కేరళ రాష్ట్రంలో అభిమానులు అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుచుకొంటారు. ఈ నేపథ్యంలో బన్నీ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా.. తెలుగు ప్రేక్షకులకు ఎలాగైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి స్పెషల్ ట్రీట్ ఇచ్చారో, అలాగే మలయాళీ ప్రేక్షకులకు కూడా ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేసిందట అల.. వైకుంఠపురములో చిత్రయూనిట్.

కేరళలో కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది అల.. వైకుంఠపురములో మూవీ. "అంగు వైకుంఠపురత్తు" అనే టైటిల్‌తో సంక్రాంతి కానుకగా జనవరి 12నే మలయాళ వర్షెన్ సైతం విడుదల కానుంది. ఈ మేరకు మలయాళీ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు తలుస్తోంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రానున్నారని టాక్. చూడాలి మరి ఈ ఈవెంట్ ఎంత ఘనంగా నిర్వహిస్తారో!.


Click it and Unblock the Notifications











