ఆ హీరోయిన్ ని వదలంటున్న చరణ్.. మళ్ళీ ఆమెనే!

వినయ విధేయ రామ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.

ఇదే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. సీత అనే గిరిజన యువతి పాత్రలో ఆమె నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టనున్నారు.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన మళ్లీ అలియా భట్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నిజానికి అలియా భట్ కి ప్రస్తుతం బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయితే దాదాపు అన్ని భాషల ప్రేక్షకులకు ఆమె పరిచయం అవుతుంది.

 Alia Bhatt to romance Charan again in Shankar dil raju movie

అలా కావడం తమ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని భావించిన దర్శకనిర్మాతలు ఈ సినిమా కోసం ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాదిలోనే మొదలు కావాల్సి ఉంది. కానీ లైకా ప్రొడక్షన్స్ సంస్థతో ఇండియన్ 2 సినిమాకి సంబంధించిన వివాదాలు మొదలైన నేపథ్యంలో ఆ సినిమా పూర్తి చేసి కానీ శంకర్ ఈ సినిమా మొదలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే అలియాభట్ కి ఈ సినిమా కథ వినిపించారని ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. ఒకవేళ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమె చరణ్ సరసన రెండో సినిమా కూడా చేస్తున్నట్లేనని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X