ఆలియా అవుట్.. సాయి పల్లవి ఇన్ .. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటీ?
Alia Bhatt - Sai Pallavi: కల్కి 2898 ADతో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి కల్కి పార్ట్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే..దాని కంటే ముందే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మొదటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను ఫైనల్ చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో టాక్.
ఆలియా ఎందుకు తప్పుకుంది?
ఇక సినిమా ప్రారంభానికి ముందు నాగ్ ఆశ్విన్ - ఆలియా కాంబినేషన్ బజ్ క్రియేట్ చేసింది. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఆలియా ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమా నుంచి తప్పుకుందట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఆలియా ప్రస్తుతం బాలీవుడ్‌లో మడ్డాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న హారర్ ఫ్రాంచైజ్ 'చాముండ'పై పూర్తి ఫోకస్ పెట్టింది. 2026 మార్చి నుంచి ఈ ప్రాజెక్ట్ షూట్ ప్రారంభం కానుంది. దీంతో భారీగా డేట్స్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో నాగ్ అశ్విన్ సినిమా కోసం కావాల్సిన డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమవుతుందని భావించి ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.

సాయి పల్లవి ఎంట్రీ
నాగ్ ఆశ్విన్ ప్రాజెక్ట్ నుంచి ఆలియా భట్ అవుట్ అయిన వెంటనే, ఈ క్రేజీ సినిమా కోసం కొత్త హీరోయిన్ పేరు వినిపిస్తోంది. అదే సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రూపొందుతున్న 'రామాయణ్'సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి భారీగా డేట్స్ కేటాయించిన సాయి పల్లవి, 2026 మధ్య నాటికి రామాయణ షూట్ పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత ఆమె నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కోసం డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్‌లో గట్టి చర్చ నడుస్తోంది.
సాయి పల్లవి సరైన ఎంపికానే?
సాంప్రదాయ బాలీవుడ్ స్టార్ ఇమేజ్ లేకపోయినా, సాయి పల్లవి తన సహజ నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నాగ్ అశ్విన్ ఎప్పుడూ ప్రయోగాత్మక కథలకు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు. ఇలా నాగ్ ఆశ్విన్ - సాయి పల్లవి కాంబినేషన్ కొత్త అంచనాలు క్రియేట్ చేయడమే కాకుండా స్టార్డమ్ స్టేటస్ కాకుండా కథ బలాన్నే నమ్ముకునే ప్రాజెక్ట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక దీపికా పదుకొనే వరుసగా రెండు తెలుగు ప్రాజెక్టుల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
ఆలియా భట్ కూడా నాగ్ అశ్విన్ సినిమా నుంచి తప్పుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి సాయి పల్లవిపై పడింది. నిజంగానే "ఆలియా అవుట్ - సాయి పల్లవి ఇన్" కాంబినేషన్ కన్‌ఫామ్ అవుతుందా? లేక మరొక సర్ప్రైజ్ వస్తుందా? అన్నది త్వరలోనే క్లియర్ అవుతుంది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇటీవల కాలంలో వరుసగా దక్షిణాది ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా స్పిరిట్, కల్కి 2898AD పార్ట్ 2 వంటి భారీ చిత్రాల నుంచి ఆమె బయటకు తప్పుకోవడం చర్చనీయంగా మారింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ సినిమాలో దీపికా హీరోయిన్‌గా ఫైనల్ అయినట్టు టాక్ వచ్చింది. కానీ తర్వాత ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ టాక్ ప్రకారం దీపికా వేసిన భారీ డిమాండ్స్-వర్కింగ్ అవర్స్, సెట్లో ప్రత్యేక సౌకర్యాలు, ఇతర షరతులు-నిర్మాతలకు భారం కావడంతోనే దర్శకుడు సందీప్ చివరికి ఆమెను పక్కన పెట్టేశారని ప్రచారం జాతీయ స్థాయిలో జరిగింది.
కల్కి 2 నుంచి కూడా అవుట్
ఆ తర్వాత నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న కల్కి 2898AD పార్ట్ 2 నుంచి కూడా దీపికా తప్పుకోవడం మరోసారి హాట్ టాపిక్ అయింది. మొదటి భాగంలో కీలక పాత్ర పోషించిన ఆమె, సీక్వెల్‌లో లేకపోవడం అభిమానులకు సర్ప్రైజ్‌గా మారింది. దీనిపై కూడా వర్కింగ్ స్టైల్, షెడ్యూల్ సమస్యలు, ప్రొడక్షన్ టీమ్‌తో తలెత్తిన విభేదాలే కారణమని ఇండస్ట్రీ టాక్. ఇలా వరుసగా రెండు భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడంతో, దీపికా తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











