For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి 'ఈగ'పై ఆ సినిమాలో ప్యారడీ సీన్స్

  By Srikanya
  |

  ఓ సినిమా విజయవంతం అయ్యిందంటే వెంటనే ఆ చిత్రానికి స్పూఫ్ లు ప్యారడీలు చేసేయ్యటం మనకు ఆనవయితీనే. తాజాగా రాజమౌళి 'ఈగ' చిత్రం ఘన విజయం సాధించిన నేఫద్యంలో ఈ చిత్రం క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కానూ అల్లరి నరేష్ ఓ స్పూఫ్ తో రెడీ అవుతున్నట్లు సమాచారం. అల్లరి నరేష్ తాజా చిత్రం సుడిగాడులో ఈ చిత్రంపై స్ఫూఫ్ రూపొందించి కలుపుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఈగ ను వారు తీగ (తేనెటీగ)అని పెడుతున్నట్లుగా చెప్తున్నారు. ఈ సీన్స్ కు ధియోటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ట్రైలర్స్ లోనూ ఈగ స్పూఫ్ తోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

  ఇక అల్లరి నరేష్ కొత్త చిత్రం 'సుడిగాడు'లో పవన్ కళ్యాణ్ జల్సా ని స్పూఫ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా జల్సా లో పవన్ తరహాలో స్టిల్ పెట్టి తీయించారు. తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. పాటలు ఈ నెలలో నే విడుదల చేస్తారు.

  'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత.మోనాల్ గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్ చిత్రంలో చేసింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన ప్రయత్నం. విజయవంతమైన చిత్రాల్లోని పలు సన్నివేశాల పేరడీతో కథ సాగుతుంది. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. ఇటీవలే కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కించాం. అసలు ఈ కథలో సుడిగాడు ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో నరేష్‌ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

  పింకి పింకి పోంకి ఫాదర్ హేడ్ ఎ డాంకీ అంటూ అల్లరి నరేష్ పాడుతున్నారు. తన తాజా చిత్రం 'సుడిగాడు'కోసం ఆయన స్వయంగా ఈ పాటను పాడారు. మొత్తం ఓ ఫ్యామిలీ సాంగ్ గా ఈ పాట తెరకెక్కుతోంది. చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌.

  English summary
  Allari Naresh Naresh is busy with the shaping up of his movie ‘Sudigadu’ which is completely filled with spoofs and parodies of all films. Now, the latest update is that the makers are planning to have a special scene targeting the latest super hit movie ‘Eega’. They want to call it ‘Theega’ special. While it is not sure what the status of ‘Sudigadu’ is but if the spoof on ‘Eega’ also is included then it is bound to increase the mileage of the film in a big way.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X