»   » 'సెల్ఫీరాజా' ఇన్ సైడ్ టాక్, కథ ఏంటి ? : నరేష్ ని నిలబెడుతుందా?

'సెల్ఫీరాజా' ఇన్ సైడ్ టాక్, కథ ఏంటి ? : నరేష్ ని నిలబెడుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సెల్ఫీరాజా' చిత్రాన్ని ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి చౌదరి, కమాన్న రణవత్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి జి. ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయికార్తీక్‌ సంగీతం సమకూర్చారు.

సెల్ఫీ పిచ్చితో ఓ కుర్రాడు పడిన పాట్లు ఎలాంటివన్నదే 'సెల్ఫీరాజా' చిత్రం హీరో,దర్శక,నిర్మాతలు చెప్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది సోనాక్షి చౌదరి 'జేమ్స్‌బాండ్‌' చిత్రం తర్వాత అల్లరి నరేష్‌తో కలిసి నటించిన చిత్రమిది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కన్నడంలో వచ్చి హిట్టైన విక్టరి అనే చిత్రానికి రీమేక్. అయితే తెలుగు నేటివికి మార్చి పూర్తి కామెడీగా మార్చారని సమాచారం.

మూడేళ్ల క్రితం కన్నడలో విడుదలై విజయం సాధించిన చిత్రం విక్టరీ. ఆ మధ్యన గా అత్తారింటికి దారేది సినిమాను కన్నడలో రీమేక్ చేసిన నందకిశోర్.. తన తొలిచిత్రంగా విక్టరీ సినిమా రూపొందించాడు. కన్నడలో కామెడీ హీరోగా పేరున్న శరణ్ హీరోగా నటించగా.. ఆడు మగాడ్రా బుజ్జి ఫేం అస్మితా సూద్ హీరోయిన్ గా నటించింది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ.. కన్నడ నాట సూపర్ హిట్ గా నిలచింది. ఇప్పుడీ సినిమానే నరేశ్ హీరోగా తెలుగులో రీమేక్ అయ్యింది.

మొదటి రాత్రే

మొదటి రాత్రే

ఈ చిత్రం హీరో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల మొదటి రాత్రే వీరిద్దరూ విడిపోతారు

ఫలించని ఆత్మహత్యాప్రయత్నం

ఫలించని ఆత్మహత్యాప్రయత్నం

దాంతో చందు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటాడు చాలా సార్లు. అయితే అవేమీ సక్సెస్ కావు.

లోకల్ డాన్ కు సుపారి

లోకల్ డాన్ కు సుపారి

దాంతో అతను ఓ లోకల్ డాన్ ని ఓ వారంలో చంపమంటూ సుపారి ఇస్తాడు.

అయితే ఈ లోగా....

అయితే ఈ లోగా....

అతని భార్య తిరిగి వెనక్కి వచ్చి తన మిస్టేక్ ఏమిటో తెలుసుకుంటుంది.

విషయం తెలుసుకుని..

విషయం తెలుసుకుని..

అతను లేనిదే బ్రతకలేను అంటుంది. దాంతో తను జీవితాంతం ఆమెతోనే ఉండాలి కానీ చావకూడదని ఫిక్స్ అవుతాడు.

కానీ..

కానీ..

అయిత చంపటానికి కాంటాక్టు తీసుకున్న డాన్ మాత్రం వదిలేది లేదు అంటాడు.

English summary
Naresh speaking about the film revealed the secrets of Selfie Raja. He said “We brought the remake rights three years ago and worked hard on the story. We have taken only 30 per cent of the story from the original film and have added the rest on our own,” and added four writers worked for the script
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu