Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మరో స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేష్.. మహర్షి స్టైల్ లో కాకుండా డిఫరెంట్ రోల్!
కొంతమంది యువ హీరోలు ఇతర స్టార్ హీరోల సినిమాలలో కూడా గెస్ట్ పాత్రలలో నటించడానికి ఈ మధ్యకాలంలో కొంచెం కూడా ఇబ్బంది పడడం లేదు. అంతేకాకుండా ఫుల్ లెన్త్ రోల్ అయినా సరే చేయడానికి రెడీ అంటున్నారు. ఇంతకుముందు అల్లరి నరేష్ కూడా కొన్ని సినిమాలలో స్పెషల్ పాత్రలలో కనిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు మహర్షి సినిమాలో కూడా అతను చేసిన ఎమోషనల్ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. అయితే ఆ సినిమా ద్వారా మాత్రం అతని క్రేజ్ అనుకున్నంత స్థాయిలో పెరగలేదు.
ఇక తర్వాత నాంది సినిమాతో మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ రొటీన్ కామెడీ సినిమాలు చేసిన నరేష్ కొన్ని అపజయాలు కూడా చూడాల్సి వచ్చింది. ఇక రీసెంట్గా వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో పరవాలేదు అనిపించాడు. ప్రస్తుతం మరో రెండు సినిమాలను అతను లైన్ లో పెట్టాడు. వీలైనంతవరకు డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని అల్లరి నరేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే మరొక స్టార్ హీరో సినిమాలో కూడా అతను ముఖ్యమైన పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరు కాదు అక్కినేని నాగార్జున అని కూడా టాక్ అయితే వినిపిస్తోంది. అక్కినేని నాగార్జున త్వరలోనే రైటర్ ప్రసన్నకుమార్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అతని ఫస్ట్ డైరెక్షన్ సినిమా కావడంతో కొంత ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగాయి. ఇటీవల అతను రైటర్ గా వర్క్ చేసిన ధమాకా సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఇప్పుడు నాగార్జునతో అతను ఎలాంటి సినిమా చేస్తాడు అనేది కూడా ఆసక్తిని కలిగిస్తుంది. అయితే నరేష్ కూడా అందులో ఒక మంచి పాత్రలో కనిపిస్తే బాగుంటుంది అని ప్రసన్నకుమార్ చెప్పడంతో నాగర్జున ఒప్పుకున్నట్లుగా టాక్. నరేష్ కూడా పాత్రనిడివి ఎక్కువగా ఉండటంతో ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మహర్షి తరహాలో కాకుండా ఈసారి నాగార్జున సినిమాలో నరేష్ కొంత కామెడీ టైమింగ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని కూడా టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.