»   » పొట్టోడు (అల్లు అరవింద్) చాలా గట్టోడు!

పొట్టోడు (అల్లు అరవింద్) చాలా గట్టోడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఒక్కడు", 'వర్షం", 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా" వంటి వరుస విజయాలతో ఎంఎస్ రాజు 'సంక్రాంతి" రాజుగా పేరు తెచ్చుకున్నాడు. అనంతరం 'బొమ్మరిల్లు", 'పరుగు", 'కొత్తబంగారులోకం" వంటి హిట్స్ అందించిన దిల్ రాజు 'సమ్మర్" రాజు పేరు సొంతం చేసుకున్నారు. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం అల్లు అరవింద్ హావా కొనసాగుతోంది. 50 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కించిన హిందీ 'గజిని" విపరీత లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో వచ్చిన ప్రాఫిట్స్ ను'మగధీర" కు మళ్లించి 42 కోట్ల వ్యయంతో భారీగా తెరకెక్కించారు. అంతకు రెండింతలు మగధీర వసూలు చేసింది. 'మగధీర" తెచ్చిన లాభాలతో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఖలేజా"(ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు).

పవన్ కళ్యాణ్ 'పులి" చిత్రాల హక్కులను కొనుగోలు చేశారు. రెండు భారీ చిత్రాలను ఒకేసారి కొనడం అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రాల హక్కులను సొంతం చేసుకోవడానికి 70 నుండి 80 కోట్లు ఖర్చు పెట్టారన్నది ఫిలిం వర్గాల సమాచారం. తాజాగా తనయుడు అల్లు అర్జున్ తో తీస్తున్న 'బద్రినాథ్" చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు. మగధీర స్టాండర్డ్ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట! సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పెద్ద మొత్తమిచ్చి నానాపటేకర్ ను నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంతకు రెండింతలు.. మూడింతలు వస్తుందన్న సెంటిమెంట్ అల్లు అరవింద్ లో బలపడినట్లుంది. భారీ బడ్జెట్ చిత్రాల చుట్టూ తిరుగుతున్నారు. భారీతనం కలిసోచ్చిందేమో!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu