twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నూకారపు అరెస్టు మీద అల్లు అరవింద్‌పై నిందలు

    By Bojja Kumar
    |

    సూర్య దిన పత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాశరావు విజయ బ్యాంకును మోసం చేసిన కేసులో ఇటీవల జైలు పాలైన విషయం తెలిసిందే. అయితే నూకరపు అరెస్టు వెనక చిరంజీవి బావ మరిది, సినీ నిర్మాత అల్లు అరవింద్ హస్తం ఉందనే వార్తలు వినిపస్తున్నాయి. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఉన్న శతృత్వం ఏమిటంటే...

    2009 ఎన్నికల్లో అల్లు అరవింద్ ప్రజారాజ్యం పార్టీ తరుపున అనకాపల్లి పార్లమెంటు స్థానికి పోటీ చేశారు. అరవింద్ కు పోటీగా నూకారపు సూర్య ప్రకాశరావు టీడీపీ నుంచి, సబ్బం హరి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. పత్రిక తన చేతిలో ఉండటంతో నూకారపు రోజు తన పత్రికలో అల్లు అరవింద్ లోపాలను ఎత్తి చూపుతూ కథనాలు వెలువడేలా చేసేవాడట. వీళ్ల ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నేపథ్యంలో...ఎంపీ స్తానాన్ని కాస్త కాంగ్రెస్ అభ్యర్థి సబ్బం హరి ఎగరేసుకెల్లారు.

    తన ఓటమికి నూకారపు సూర్యప్రకాశరావు కారణమని బావించిన అల్లు...సమయం చూసి దెబ్బతీద్దామని కాచుకు కూర్చున్నాడని అనకాపల్లి జనాలు గతంలో చర్చించుకున్నారు. తాజాగా నూకారపు అరెస్టయ్యాడు. ప్రస్తుతం బావ చిరంజీవితో కాంగ్రెస్ లో జంప్ అయిన అల్లు...తన పలుకుబడి ఉపయోగించి అతన్ని అరెస్టు చేయించాడని చర్చించుకుంటున్నారు.

    English summary
    Nookarapu Surya Prakasa Rao was arrested in connection with Vijaya Bank loan case. the rumor that..Allu Arvind's hand behind Nukarapu's arrest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X