For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అరవింద్ ఆ టైటిల్ రెన్యువల్ అందుకేనా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఆ మధ్యన అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ లో చరణ్-అర్జున్ అనే టైటిల్ తో సినిమా వస్తుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అది పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత ఎవడు చిత్రానికి సైతం ఇదే టైటిల్ అని మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అదీ నిజం కాలేదు. అయితే అల్లు అరవింద్ మాత్రం ఈ టైటిల్ పై మమకారం పోలేదు. ఆయన రీసెంట్ గా దాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో రెన్యువల్ చేసారు. గతంలో ఈ టైటిల్ ని గీతా ఆర్ట్స్ వారు రిజిస్టర్ చేసారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ని రెన్యువల్ చేయించటంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఏదన్నా చిత్రం ప్లాన్ చేస్తున్నారా అని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

  Allu Aravind renewals Charan-Arjun title

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ప్రస్తుతం అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం బిజీలో ఉన్నారు. . అల్లు అర్జున్‌ను తెరపై 'జులాయి'గా చూపించి ప్రేక్షకులకు వినోదాలు పంచారు త్రివిక్రమ్‌. ఆ ఇద్దరి కలయికలో ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతోంది. సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ కథానాయికలు. రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.

  Allu Aravind renewals Charan-Arjun title

  త్రిశూలం, హుషారు, జాదూగర్ వంటి టైటిల్స్ పరిశీలనలకో వచ్చినా కథ ప్రకారం ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు, హీరో భావించినట్లు సమాచారం. మార్చి చివరలో కాని,ఏప్రియల్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం విడుదల అవనుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా పడుతుందని చెప్తున్నారు. తండ్రి కొడుకుల రిలేషన్ కూడా కథలో ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

  వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది.

  ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

  మరో ప్రక్క ఈ చిత్రం పూర్తవగానే మహేష్ ,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. జూలాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2015 ఆగస్టు నుంచి ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలు ఎక్కవచ్చు. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికి మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని ఫినిష్ చేసుకుని రెడీ అవుతారు.

  రామ్ చరణ్ విషయానికి వస్తే...

  రామ్ చరణ్ ఇంకోటి కమిటయ్యారని సమాచారం. శ్రీను వైట్ల చిత్రం హడావిడిలో ఉన్న రామ్ చరణ్ ... రేసుగుర్రం వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు సురేందర్‌రెడ్డితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ మేరకు టాక్స్ జరిగినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు రామ్‌చరణ్‌ని కలిసి సురేందర్‌రెడ్డి కథ కూడా వినిపించినట్లు చెప్పుకుంటున్నారు. పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దానికి సైతం వక్కంతం వంశీ కథ అందిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో బయటకొచ్చే అవకాశం ఉంది.

  ప్రస్తుతం చరణ్‌, శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రెగ్యూలర్‌ షూటింగ్‌ జనవరి 28 నుంచి ప్రారంభిస్తారని చిత్ర యూనిట్‌ తెలిపారు. చరణ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో సమంతాను హీరోయిన్ న్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం అనంతరం సురేంద్రరెడ్డితో చిత్రం ఉంటుంది.

  Allu Aravind renewals Charan-Arjun title

  ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిలింనగర్‌ వర్గాల నుండి సమాచారం. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.

  ప్రస్తుతం సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ....రవితేజ హీరోగా కిక్‌-2 రూపొందుతుంది. ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే చిత్రాలెప్పుడూ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటాయి. రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన 'కిక్' అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం మొదలైంది. 'కిక్ 2' పేరుతో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆ మధ్యన హైదరాబాద్‌లో జరిగింది. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 28న చిత్రాన్ని విడుదల చేస్తామని కల్యాణ్‌రామ్ అన్నారు.

  English summary
  Few years back the Gita Arts production unit registered a title 'Charan-Arjun' at the Film Chamber. Now as per reports Allu Arvind renewed the title few days ago to keep it available
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X