»   » తొక్కేసాడంటూ...అల్లు అరవింద్ ని తిట్టిపోస్తున్నారు

తొక్కేసాడంటూ...అల్లు అరవింద్ ని తిట్టిపోస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allu Aravind says no to Sampoornesh babu
హైదరాబాద్ : సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో అల్లు అరవింద్ ని ఇప్పుడు ఓ రేంజిలో తిట్టిపోస్తున్నారు. కారణం మరీ కామెడీగా ఉంది. ఆయన తన కొడుకు భవిష్యత్ కోసం వేరే వారి భవిష్యత్ ని తొక్కేసే ప్రయత్నం చేసారని అంటున్నారు. ఇంతకీ ఈ టాక్ వెనక అసలు మ్యాటర్ ఏమిటీ అంటే...తన చిన్న కుమారుడు అల్లు శిరీష్ తాజా చిత్రం కొత్త జంట కోసం తెలుగు పరిశ్రమ కొత్త కమిడియన్ సంపూర్ణేష్ బాబు ని తొక్కేసాడంటున్నారు.

అసలేం జరిగిందయ్యా అంటే...మారుతి దర్శకత్వంలో, అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న కొత్తజంట లో సంపు ఓ ప్రత్యేక పాత్రలో నటించాడు. కొత్తజంట సినిమాలో సంపూపై తెరకెక్కిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయట. ఇదిగో ఉన్నట్లుండి సంపూను కొత్తజంట ప్రాజెక్ట్ నుంచి తప్పించారు . దానికి కారణం నిడివి ఎక్కువ అన్నారు. కానీ అసలు కారణం వేరే ఉందని బయిటకు వచ్చేసింది.

సంపూర్ణేష్ పై తీసిన సన్నివేశాలు బాగా రావడంతో అతను...తన కుమారుడు అల్లు శిరీష్ ను ఎక్కడ డామినేట్ చేసేస్తాడోనన్న భయంతో అల్లు అరవిందే ఈ పనిచేయించినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలబడటానికి ప్రయత్నిస్తున్న అల్లు శిరీష్ కోసం.... సంపూను తొలగించి... పాత్ర నిడివి తగ్గించి పోసానిపై రీ-షూట్ చేశారట. సంపూను స్టార్ గా నిలిపిన ఫ్యాన్స్ ... ఫేస్ బుక్ వంటి సోషల్ వెబ్ సైట్స్... కొత్తజంట నుంచి తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పోస్ట్ లు పెట్టి మరీ అల్లు అరవింద్ ని తిట్టి పోసే కార్యక్రమం పెట్టుకున్నారు.

గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. ఈ చిత్రం మే 1 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మారుతి మాట్లాడుతూ... నేను.. నా జీవితం ఇంకేమీ వద్దు. డబ్బుంటేనే జీవితం... అది లేకపోతే ఇంకేమీ లేదు. ఇలాంటి మనస్తత్వం వారిద్దరిదీ. అనుకోకుండా కలుసుకున్నారు.. మనసులు కలుపుకొన్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ జంట కథే మా 'కొత్తజంట' అన్నారు .

నిర్మాత మాట్లాడుతూ ''ఇద్దరు స్వార్థపరులు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. మారుతి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రమిది. ఈ నెల మూడోవారంలో పాటల్ని విడుదల చేస్తాము. శిరీష్ బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథతో, కొత్త లుక్‌తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు''అన్నారు.


ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది. మధురిమ, మధు, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, రోహిణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.

English summary
Sampoornesh Babu was actually part of Alu Sirish’s new film ‘Kotha Janta’ directed by Maruthi. However, fearing of Sampoo’s craze, producer and hero’s dad Allu Aravind asked the director to re-shoot his scenes replacing with other actor. Even Maruthi who can’t go against Allu Aravind's wish has already re-shot the scenes with comedians Vennela Kishore and Posani Krishna Murali included in the new version.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu