బన్నీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. పుష్ప తర్వాత సెన్సేషనల్ కాంబో రెడీ.. సెట్ చేసిన అల్లు అరవింద్!

గత ఏడాది అల వైకుంఠపురములో హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప అనేసినిమా చేస్తున్నారు. సుక్కు సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్‌లోకి మారిపోయిన అల్లు అర్జున్ ప్రస్తుతం కరోనా సోకడంతో రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఇక ఆయన లేకపోవడంతో సినిమా షూటింగ్ ఆపుతారని అనుకున్నారు.

కానీ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ డేట్స్ మళ్లీ దొరకవేమో అని షూటింగ్ కొనసాగించాలని చూశారు. అయితే ఫహాద్ ఫాజిల్ కోచింగ్ వెళ్లిపోయిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగింది. అయితే బన్నీ తర్వాత ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర చర్చ జరుగుతోంది ఆ వివరాల్లోకి వెళితే

పుష్ప ఆగింది

పుష్ప ఆగింది

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి. స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతానికి అన్ని సినిమాల లాగే ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివతో ఓ సినిమా చేయాల్సి ఉంది.

కొరటాల శివ కాంబో లేట్

కొరటాల శివ కాంబో లేట్

ఈ మేరకు గత ఏడాది అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అల్లు అర్జున్ కొరటాల కాంబినేషన్ లో సినిమా ప్రకటన వెలువడిన నేపథ్యంలో దాదాపు అందరూ పుష్ప తర్వాత అదే సినిమా ఉంటుందని భావించారు.. కానీ పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల సినిమా ఉండదు అని అంటున్నారు.. దానికి కారణం కొరటాల శివ ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమా ఒప్పుకొని మొదలు పెట్టే ప్రయత్నం చేయడమే.. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మరో దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు.

సెట్ చేసిన అల్లు అరవింద్

సెట్ చేసిన అల్లు అరవింద్

అల్లు అర్జున్ దర్శకుల కోసం వెతుకుతున్నారు అన్న విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ ఇప్పుడు తమిళ దర్శకుడు మురుగదాస్ ని లైన్ లో పెట్టారని తెలుస్తోంది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని గత రెండు మూడేళ్ల నుంచి అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. గతంలో మురుగదాస్ బన్నీకి కథ చెప్పాడని, బన్నీకి కూడా కథ నచ్చడంతో అధికారిక ప్రకటన మాత్రమే లేట్ అని అప్పట్లో ప్రచారాలు జరిగాయి..

కానీ ఇప్పటి దాకా దానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఈసారి అల్లు అరవింద్ బన్నీకి సంబంధించిన ప్రాజెక్ట్ సెట్ చేశారని అంటున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్ లో ఉంటుందని, అల్లు అరవింద్ దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించనున్నారని అంటున్నారు.

మురుగదాస్ అల్లు అర్జున్ కాంబో

మురుగదాస్ అల్లు అర్జున్ కాంబో

వీలైనంత త్వరలో అల్లు అర్జున్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.. చివరిగా రజనీకాంత్ హీరోగా దర్బార్ అనే సినిమా చేసిన మురుగదాస్ ఆ సినిమా 2020 సంక్రాంతి కి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మంచి స్పందన లభించింది.. దీని తర్వాత ఆయన ఎలాంటి సినిమాలు అనౌన్స్ చేయలేదు మురుగదాస్. అయితే అల్లు అర్జున్ తో సినిమా మాత్రం త్వరలో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

గజిని సీక్వెల్

గజిని సీక్వెల్

ఇక ఈ సినిమా గజిని సీక్వెల్ అనే ప్రచారం కూడా గతంలో జరిగింది.. ఎందుకంటే గతంలో గజిని 2 అనే టైటిల్ ని గీతా ఆర్ట్స్ సంస్థ ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించుకుంది.. దీంతో గజినీ రూపకర్త అయిన మురుగదాస్ తో ఈ సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది.. మళ్లీ ఇప్పుడు అదే ప్రాజెక్టు తో ముందుకు వస్తారా ? లేక అల్లు అర్జున్ కోసం స్పెషల్ ప్రాజెక్టు ఏమైనా రెడీ చేసి ఉంచారా ? అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X