»   » అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ ఇచ్చిన షాక్ తో దాసరి దిమ్మతిరిగింది..

అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ ఇచ్చిన షాక్ తో దాసరి దిమ్మతిరిగింది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును ప్రముఖ నిర్మాతలు దగ్గుపాటి సురేష్, అల్లు అరవింద్ వెర్రిపప్పను చేశారు. దాసరి తన 150వ చిత్రంగా 'పరమవీర చక్ర"ను తీసి జనవరి 12న విడుదల చేశారు. అయితే బాలయ్య నటించిన ఈ భారీ చిత్రానికి మంచి థియేటర్లు దొరకకపోవటం కాదు దొరకనివ్వకుండ చేసి, దాసరిని ఒక రకంగా అవమాన పరిచారని దాసరి శిష్యులు గోల చేశారు. అసలు కారణం ఏమిటి? థియేటర్లు బాలయ్య సినిమాకు దొరక పోవటమేమిటని అంటే దానికి కారణాలు మాత్రం బలంగానే ఉన్నాయి.

సంక్రాంతి పండుగ సందర్భంగా పరమవీరచక్రతో పాటు గోల్కొండ హైస్కూల్, అనగనగా ఒక ధీరుడు, రవితేజ నటించిన మిరపకాయ్ విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కాగా గోల్కొండ హైస్కూల్, అనగనగా ఓ ధీరుడు చిత్రాలను సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతున్నాయి. మిరపకాయ్ చిత్రాన్ని అల్లు అరవింద్ తీసుకున్నారు. ఈ నిర్మాతలిద్దరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంచి థియేటర్స్ లో ప్రదర్శించటానికి ముందే రెడీ అయ్యారు.

దాసరి పరమవీర చక్ర విడుదల చేయటానికి ఈ నిర్మాతలు సుముఖతను వ్యక్తం చేయకపోవటం విశేషం. ఎందుకంటే దాసరి దర్శకత్వం అనగానే సినిమా మీద నమ్మకాలు లేని ఈ నిర్మాతలు మిగతా సినిమాల మీద నమ్మకంతో మంచి థియేటర్లను ఎంచుకున్నారు. ఇదిలాఉండగా పరమవీర చక్ర"కు మంచి థియేటర్లు లేకపోవటంతో, బాలయ్య ఫ్యాన్స్ దాసరిపై విరుచుకపడ్డారు. ఈ విషయంలో దాసరి చాలా మనస్థాపానికి గురియ్యాడని సురేష్ మీద, అల్లు అరవింద్ మీద బాగా కోపంగా ఉన్నాడని, కావాలనే ఈ ఇద్దరు నిర్మాతలు ఆడిన గేమ్ గా భావించిన దాసరి వారిపై ఫైర్ గా ఉన్నాడని టాలీవుడ్ లో టాక్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu