»   » బన్నీ పెళ్లి మ్యాటర్ నిజమే కానీ..సున్నితంగా మీడియాకు చురకలు...

బన్నీ పెళ్లి మ్యాటర్ నిజమే కానీ..సున్నితంగా మీడియాకు చురకలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో అల్లు అర్జున్ త్వరలో వరుడు కాబోతున్నాడు..ఇదీ ఈ రోజు మీడియాలో హాటెస్ట్ న్యూస్. హైదరాబాద్ శివార్లలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ శేఖర్ రెడ్డి కుమార్తె స్నేహారెడ్డిని అల్లు అర్జున్ పెళ్లాడబోతున్నాడంటూ వార్తలు వినవస్తోన్న సంగతి విదితమే. ఈ విషయమై అల్లు ర్జున్ తండ్రి, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ పెదవి విప్పారు.

'అది నిజమే..పెళ్ళి ప్రయత్నాలు జరుగుతున్నాయి..ఇంకా చర్చల దశలోనే వున్నాయి..త్వరలోనే అన్ని వివరాలూ వెల్లడిస్తాం..అప్పటివరకు వేచి వుండండి..చర్చల దశలో వున్నప్పుడు వార్తా కథనాలు రావడం మంచి పద్దతి కాదు..అది ఇరు కుటుంబాల గౌరవానికీ భంగం కలిగిస్తుంది. అంటూ మీడియాకి సున్నితంగా చురకలేసే ప్రయత్నం చేశారు అల్లు అరవింద్. ఇదిలా వుంటే, అల్లు అర్జున్ ది పెద్దల అంగీకారంతో జరగనున్న ప్రేమ వివాహమనీ, ఇరు కుటుంబాలూ త్వరలోనే ఈ విషయమై మీడియాకి ఓ ప్రకటన విడుదల చేయనున్నారనీ తెలుస్గోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu