»   » 'కొమురం పులి' టిక్కెట్ రేటు పెంచే పనిలో అల్లు అరవింద్...

'కొమురం పులి' టిక్కెట్ రేటు పెంచే పనిలో అల్లు అరవింద్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కొమురం పులి చిత్రం టిక్కెట్ రేటుని 75 రూపాయలకు పెంచాలని పంపిణీ దారుడుగా అల్లు అరవింద్ నిర్ణయించుకున్నాడని సమాచారం. ఇప్పటివరకూ 50 రూపాయలు ఉన్న టిక్కెట్ కాస్ట్ దాంతో 75 రూపాయలు అవుతుంది. ఈ మేరకు అల్లు అరవింద్ చిత్ర నిర్మాత శింగనమల రమేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రమేష్ తాను అనుకున్న బడ్జెట్ కన్నా ఈ చిత్రం లిమిట్ దాటిపోయిందని కాబట్టి మొదటి అల్లు అరవింద్ కమిటయిన రేటు ఇవ్వలేనని అనటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ టిక్కెట్లు పెంచే విషయమై స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఓకే చేస్తే మొదటి రెండు వారాలు ఈ రేటుతో టిక్కెట్ రేటు పెరుగుతుంది. అప్పట్లో జై చిరంజీవ సమయంలో అశ్వనీదత్ అలా టిక్కెట్ రేటు పెంచిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu