For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ 60 కాస్ట్యూమ్స్ ఫోటో షూట్

  By Srikanya
  |

  హైదరాబాద్: అల్లు అర్జున్ తన తాజా చిత్రం ఇద్దరు అమ్మాయిలతో కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రం ఫోటో షూట్ కోసం అరవై కాస్ట్యూమ్స్ వాడి హాట్ టాపిక్ గా మారారు. రీసెంట్ గా ఈ చిత్రం కోసం ఫోటో షూట్ చేసారు. పూరీ జగన్నాధ్ కూడా పూర్తిగా దృష్టి ఈ చిత్రంపైనే పెట్టారని,అందుకే ఎలాగైనా దేశముదురుని మించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకునే ఇలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

  ఇక ఈ కాస్ట్యూమ్స్ కోసం కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టనున్నారనే వార్త అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. సినిమాలో క్యారెక్టర్ షో పుటప్ చేయటానికి ఈ రేంజి లో ఖర్చు పెట్టడానికి నిర్మాత బండ్ల గణేష్ సంతోషంగా ఒప్పుకున్నారని సమాచారం. పాత్ర ప్రకారం బన్ని ఈ చిత్రంలో వెరీటీ గెటప్స్ లో, రకరకాల కాస్ట్యూమ్స్ తో కనపడతాడని తెలుస్తోంది. అమలాపాల్‌, కేధరీన్ తెరీసా హీరోయిన్స్ . ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ సెకండ్ వీక్ లో ప్రారంభం కానుంది.

  ఈ చిత్రం గురించి అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పను. నాకెంతో నచ్చింది. ఎప్పట్నుంచో సినిమా చేద్దాం అని గణేష్ అడుగుతున్నారు. ఈ చిత్రంతో కుదిరింది. ఒక మంచి నిర్మాతకు కావల్సిన అన్ని లక్షణాలు గణేష్‌లో ఉన్నాయి. 'దేశముదురు' సమయంలో నేను సిక్స్‌ప్యాక్ చేయగలిగానంటే దానికి కారణం జగన్‌గారే. చెప్పిన సమయానికి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి, నాకు వర్కవుట్లు చేసుకునే అవకాశం కల్పించేవారు'' అన్నారు.

  పూరి చిత్రం గురించి చెబుతూ ''ఇదో ప్రేమ కథా చిత్రం. బన్నీ అంటేనే ఎనర్జీ. తనే కాదు సెట్‌లో అందర్నీ ఉత్సాహంగా ఉరకలేయిస్తారు. ఈ కథను అల్లు అరవింద్‌కు చెప్పినపుడు మావాడికి బాగుంటుందని చెప్పారు. తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో. ఈ సినిమా కథను బన్నీకి చెప్పినప్పుడు.. మనమే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత అరవింద్‌గార్ని కలిసినప్పుడు 'బన్నీకి ఒక కథ చెప్పావట.. అది తనతోనే చెయ్యి. తనకు బాగా నచ్చింది' అన్నారు. ఇది లవ్‌స్టోరి. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం షూటింగ్ చేస్తాం''అన్నారు.

  నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ -''పూరి అన్ని చిత్రాల్లోకెల్లా ఇది వ్యత్యాసంగా ఉంటుంది. బన్నీతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అరవింద్‌గారిని అడుగుతున్నాను. బన్నీ నా రోల్ మోడల్. చాలా కష్టపడతాడు. 'నాయక్' కోసం అమలాపాల్ చేసిన డాన్స్ చూశాను. బ్రహ్మాండంగా చేసింది. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది. పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని నాలుగేళ్లుగా అనుకుంటున్నాను. నిర్మాతగా నా కెరీర్‌ ఆయనతోనే మొదలుకావాల్సింది. ఇప్పటికి కుదిరింది. ఈ నెల రెండవ వారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతాము'' అన్నారు.

  అల్లు అర్జున్‌ని మాస్‌లోకి చొచ్చుకువెళ్లేలా చేసిన సినిమా 'దేశముదురు'. పూరి జగన్నాథ్ మార్క్ పాత్ర చిత్రణతో అందులో అల్లు అర్జున్ పూర్తి మాసివ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందనుంది. వైవిధ్యభరితంగా టైటిల్స్ పెట్టే పూరి ఈ చిత్రం కోసం 'ఇద్దరమ్మాయిలతో' అనే టైటిల్ ఫిక్స్ చేయటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు . పూరి తరహా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందనుంది.

  English summary
  
 Allu Arjun is going to be seen in a very sophisticated way in ‘Iddarammayilatho’ movie and he is preparing extensively for it. A photo shoot was carried out recently to test the look and feel of the character and over 60 costumes were used for this. Allu Arjun and director Puri Jagan personally went through the whole set to choose the appropriate ones for the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X