»   » రజనీ కి నో క్లియరెన్స్.. కానీ బన్నీ కి ఓకే

రజనీ కి నో క్లియరెన్స్.. కానీ బన్నీ కి ఓకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక్కోసారి ఎంత పెద్ద స్టార్ చేద్దమనుకున్న పనినా రకరకాల కారణాలతో ముందుకు వెళ్లలేకపోవచ్చు. ఎలాంటి ప్లాన్ లేకుండా మిగతావాళ్లు వాటిని ఈజీగా సాధించవచ్చు. రజనీకాంత్ తన తాజా చిత్రం ‘2.0' (రోబో 2) కోసం పిభ్రవరిలో బొలీవియా వెళ్ధామనుకున్నారు. కానీ సాధ్యపడలేదు.

పాస్ పార్ట్ ఇబ్బందులతో షూటింగ్ వాయిదాపడింది. అయితే అల్లు అర్జున్ కు మాత్రం ఆ సమస్య రాలేదు. ఇంతకీ రజనీకి వచ్చిన సమస్య ఏమిటీ అంటే క్లియరెన్స్ సర్టిఫికేట్. బొలివియా రూల్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది.

శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ నటించనుండగా ప్రస్తుతం ఈ చిత్రాన్ని బొలీవియాలో తెరకెక్కించేందుకు యూనిట్ ప్లాన్ చేసింది. షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ అంతా త్వరలోనే బొలివియా వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

Allu Arjun ahead of Rajini

కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల కొన్ని వివాదాలతో ఇబ్బందులను ఎదుర్కోగా, తాజాగా ఆయన చెన్నై నగర పోలీస్ కమీషనర్‌కు ఓ దరఖాస్తు పెట్టుకున్నారట. అందులో తనపై ఎలాంటి కేసులు లేవనే ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారట. అందుకు కారణం రజనీకాంత్ షూటింగ్ నిమిత్తం బొలీవియా వెళ్ళనుండగా, అక్కడికి వెళ్ళాలంటే పోలీస్ ధృవీకరణ పత్రం తప్పక ఉండి తీరాలట. దీని కోసమే రజనీ దరఖాస్తును పెట్టుకున్నారని తెలుస్తోంది.

ఇక అల్లు అర్జున్ కు అలాంటి అసరం లేకపోయింది. ఆయనకు పూర్తి క్లియరెన్స్ వచ్చింది. సరోనోడు చిత్రం కోసం అక్కడకి వెళ్లిన టీమ్ ఈ వీకెండ్ తర్వాత ఓ పాటను ప్లాన్ చేసుకున్నారు. మార్చి 5 నుంచి సాంగ్ షూటింగ మొదలయ్యి మార్చి 15 కి వెనక్కి రావాలని నిర్ణయించుకున్నారు.

English summary
A song will be shot on Allu Arjun and Rakul Preet Singh later this weekend in Bolivia.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu