»   » బ్రహ్మాణ పాత్రలో అల్లు అర్జున్,‘అదుర్స్‌’లో కామెడీ చేస్తూ...?

బ్రహ్మాణ పాత్రలో అల్లు అర్జున్,‘అదుర్స్‌’లో కామెడీ చేస్తూ...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ దర్సకత్వంలో ఎన్టీయార్‌ హీరోగా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం అదుర్స్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్‌ రోల్‌లో కనిపించి నవ్వించారు. అందులో ఎన్టీయార్‌ 'చారి' పాత్రలో వీర విహారం చేశాడనే చెప్పాలి. అయితే ఇప్పుడు కొంచెం అటూ ఇటూగా అటువంటి పాత్రలోనే అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడం జగన్నాథం'లో అల్లు అర్జున్‌ ఓ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ పాత్ర దాదాపుగా 'అదుర్స్‌'లోని చారి పాత్రనే పోలి ఉంటుందట. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుందట. 'గబ్బర్‌సింగ్‌' తర్వాత ఆ స్థాయి విజయం అందుకోలేకపోయిన హరీష్‌ ఈ సినిమాతో ఆ సినిమాని దాటే హిట్ కొట్టాలనే పట్టుదలతో పనిచేస్తున్నారట.

Allu Arjun as Brahim in DJ Movie?

ఇక అదుర్స్ సినిమాలో ఎన్టీయార్‌-బ్రహ్మానందం పండించిన కామెడీ ఎవరూ మర్చిపోరు. అయితే ఆ ట్రాక్ రాసింది హరీష్ శంకరేట. హరీష్‌ శంకర్‌ ఆ సినిమాకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాడట. ముఖ్యంగా ఆ సినిమాలో ఎన్టీయార్‌-బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చిన సీన్లన్నింటినీ హరీష్‌ శంకరే రాశాడట. దాంతో ఈ సారి అదే తరహా మ్యాజిక్ ని రిపీట్ చేయటానికి హరీష్ ఫ్లాన్ చేస్తున్నారట.

'సరైనోడు' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత అల్లు అర్జున్‌ నటించే సినిమా పట్ల అందరికీ ఆసక్తి ఎక్కువైంది. అందుకు తగ్గట్టే ఆయన కొంత సమయం తీసుకుని మంచి స్ర్కిప్టులను ఎంచుకునే పనిలో పడ్డారు. ఎట్టకేలకు దిల్‌ రాజు నిర్మాణంలో, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఇకపోతే ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేశారు.
గతంలో బన్నీతో కలిసి 'ఆర్య-2, ఎవడు' వంటి చిత్రాల్లో నటించిన కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైధీ నెం.150' లో కూడా నటిస్తోంది.

ఇకపోతే ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ ఆయాంకా బోస్ పనిచేయన్నారు. ఈ చిత్రాన్ని 2017 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

English summary
Allu Arjun is going to be seen in a never seen before character as DJ aka Duvvada Jagannadham. Allu Arjun is playing a Brahmin character that is reminiscent of Chari character from Adurs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu