»   » అల్లు అర్జున్ 'బద్రీనాధ్' అందుకే లేటవనుందా?

అల్లు అర్జున్ 'బద్రీనాధ్' అందుకే లేటవనుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ హీరోగా వివి వినాయిక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించనున్న 'బద్రీనాధ్' చిత్రం షూటింగ్ ప్రారంభంకావటానికి లేటవనుందని సమాచారం. కారణంగా వివి వినాయిక్...తండ్రి కృష్ణారావు హఠాత్తుగా హార్ట్ స్ట్రోక్ తో మరణించటం అని చెప్తున్నారు. తన తండ్రి మరణ విషాదం నుంచి కోలుకోవటానికి కొద్ది రోజులు పట్టేటట్లు ఉందని అంటున్నారు. అలాగే కొద్ది రోజులుగా వినాయిక్..స్టోరీ డిస్కషన్ లలో పాల్గొనటం లేదు. దాంతో కథ ఇంకా ఫైనలైజ్ కాలేదని చెప్తున్నారు.స్టోరీ లైన్ గా ఓకే చేసి ప్రస్తుతం సీన్స్ తయారీ పనిలో ఉన్నారు. ఇక చిన్ని కృష్ణ చిరకాల విరామం తర్వాత కథ ఇస్తున్న బదిరీనాధ్ర్ చిత్రం కోసం బదిరీనాధ్ గుడి సెట్ ను ఉత్తరాంచల్ లో బదిరీనాధ్ దేవస్ధానానికి దగ్గరలో వేస్తున్నట్లు సమాచారం.

దాదాపు అవరై రోజులు పాటు రెండు షెడ్యూల్ లలో ఆ సెట్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ డేస్ లో దాదాపు నలభైరోజులు ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ (పీరియడ్ డ్రామా)కే సరిపోతుందంటున్నారు. అప్పటి జరిగిన కథకు ఈ కాలానికి లింక్ వేసే సన్నివేసాలుకు ఇరవై రోజులు కేటాయిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది కావటంతో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu