»   » హాట్ టాపిక్ : అల్లు అర్జున్ గట్టిగానే ఛార్జ్ చేసాడు

హాట్ టాపిక్ : అల్లు అర్జున్ గట్టిగానే ఛార్జ్ చేసాడు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : అల్లు అర్జున్ రీసెంట్ గా జాయ్ అలూకాస్ వారికి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసిన విషయం తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ పై రీసెంట్ గా యాడ్ ని సైతం చిత్రీకరించారు. త్వరలో ఆ యాడ్ అన్ని ఛానెల్స్ లోనూ టెలీ కాస్ట్ కానుంది. ఈ ప్రాజెక్టు నిమిత్తం అల్లు అర్జున్ ..దాదాపు కోటిన్నర వరకూ ఛార్జ్ చేసాడని ఫిల్మ్ నగర్ ఇన్నర్ సర్కిల్స్ లో వినపడుతోంది. అంతకు ముందు కోల్గెట్, 7 అప్ యాడ్స్ కు యాభై లక్షలు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు కోటిన్నర తీసుకోవటంతో హాట్ టాపిక్ గా మారింది.

  ప్రస్తుతం అల్లు అర్జున్ పూరీ జగన్నాధ్ 'ఇద్దరమ్మాయిలతో' టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు .'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమా టైటిల్ ట్రేడ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎప్పుడూ వెరైటీ టైటిల్స్‌తో సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి స్క్ర్రిప్టుని డిఫెరెంట్ గా పూర్తి స్ధాయి వినోదం తో సమకూర్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి 'దేశముదురు' సినిమా చేశారు. అది అర్జున్‌కు మాస్ ఇమేజ్‌ను పెంచింది. పాత్ర ప్రకారం బన్ని ఈ చిత్రంలో వెరీటీ గెటప్స్ లో, రకరకాల కాస్ట్యూమ్స్ తో కనపడతాడని తెలుస్తోంది. అమలాపాల్‌, కేధరీన్ తెరీసా హీరోయిన్స్ .

  మరో ప్రక్క అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనుంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా. కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. బేబి భవ్య సమర్పిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ "అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. వక్కంతం వంశీ మంచి కథతో ముందుకొచ్చారు.

  బన్నీ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్ అంటే సినిమా ఎంత స్టైలిష్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారిద్దరి శైలి తెరపై ఆవిష్కృతమవుతుంది. ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో తెరకెక్కిస్తాం అన్నారు. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బన్నీ చిత్రానికి థమన్ స్వరాలు సమకూర్చడం ఇదే తొలిసారి . ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, దర్శకత్వం: సురేందర్ రెడ్డి, సంగీతం: థమన్, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు.

  English summary
  
 Allu Arjun has charged Rs.1.5 cr for signing as brand Ambassador to ‘Joy Alukkas” a jewellery company. Recently a commercial ad has been shot which would be telecasted in various TV channels shortly. Earlier also he endorsed the brands like 7 up and Colgate for which he charged more than Rs.50 lakhs. Apart from Allu Arjun, Hero Nagarjuna who is also a brand ambassador to Kalyan Jewellers has charged more than one crore similarly Mahesh Babu for Jos Alukkas and Jr.NTR for Malabar gold and Diamonds were charged more than one crore.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more