»   » అందుకే అల్లు అర్జున్ హ్యాండ్ ఇచ్చాడా..?

అందుకే అల్లు అర్జున్ హ్యాండ్ ఇచ్చాడా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allu Arjun
హైదరాబాద్ : అల్లు అర్జున్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం అంటూ ఆ మధ్యన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే గోపీచంద్ మలినేని సైతం బలుపు చిత్రం తర్వాత ఆ మేరకు అల్లు అర్జున్ కి కథ రెడీ చేసే పనిలో పూర్తి బిజీగా గడిపారు. అయితే ఏమైందో ఏమో ఊహించని విధంగా సీన్ మారింది. గోపిచంద్ మలినేని, రామ్ కాంబినేషన్ ఖరారైంది. దాంతో అసలేం జరిగింది..అల్లు అర్జున్ ..నో చెప్పటానికి కారణం ఏంటనేది హాట్ టాపిక్ గా ఇండస్ట్రీలో మారింది.

ఇండస్ట్రీలో చెప్పుకునేదాని ప్రకారం గోపీచంద్ మలినేని...నాలుగు నెలలు పాటు తయారు చేసిన కథ పూర్తిగా అల్లు అర్జున్ విన్నాడని చెప్తున్నారు. అయితే కథ ఎంటర్టైన్మెంట్ తో బాగున్నా...పూర్తిగా రవితేజ చిత్రంలా దాన్ని తయారు చేసాడని,వింటూంటే రవితేజ రెగ్యులర్ మ్యానరిజంలు,డైలాగు డెలవరీ గుర్తుకు వచ్చేలా ఉందని అందుకే నో చెప్పాడని చెప్పుకుంటున్నారు. అయితే ఇది కేవలం టాక్ మాత్రమే..అల్లు అర్జున్..త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లటంతో ఇటు రామ్ దగ్గరకి వెళ్లాల్సిన పరిస్ధితి గోపీచంద్ కి వచ్చిందని కొందరంటున్నారు.

ఎన్నో కథలు విని, ఎంతో మంది దర్శకులును పిలిచి మాట్లాడి చివరకు రామ్ తన తదుపరి చిత్రం ఓకే చేసారు. రామ్ కొత్త చిత్రం ఎనౌన్స్ చేసారు. ఈ సారి రామ్ ని బలుపు తో ఫ్లాప్ లలో ఉన్న రవితేజకు హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ని దర్శకుడుగా ఎంచుకున్నారు. యునైటెడ్‌ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించనుంది. పరుచూరి కిరీటి నిర్మాత.

'డాన్‌శీను'తో ఆకట్టుకొన్నారు గోపీచంద్‌ మలినేని. 'బలుపు'తో గతేడాది మరో విజయం అందుకొన్నారు. మధ్యలో వచ్చిన బాడీ గార్డ్ నిరాశరిచినా..బలుపు హిట్ తో ఆయనకి మంచి క్రేజే ఉంది. అల్లు అర్జున్ తో చిత్రం అని స్క్రిప్టు రెడీ చేసుకుని సిద్దమవుతున్న సమయంలో ...రామ్ తో ఎనౌన్స్ చేసి అందిరనీ ఆశ్చర్యంలో ముంచారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ''రామ్‌లోని హుషారుకి తగిన కథ ఇది. మాస్‌, యాక్షన్‌, వినోదం.. ఇవన్నీ కలగలిసి ఉంటుంది. డాన్‌శీను', 'బాడీగార్డ్', 'బలుపు' వంటి హిట్ చిత్రాల తరువాత చేస్తున్న సినిమా ఇది. రామ్ ఎనర్జీకి తగినట్లుగా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించడానికి సబ్జెక్ట్ రెడీ చేశాం. రామ్‌కిది మరో మంచి సినిమా అవుతుంది' అన్నారు. ''అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''స్క్రిప్టు బాగా వచ్చింది. రామ్‌ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం అవుతుంది. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. హీరోయిన్, మిగిలిన సాంకేతిన నిపుణుల వివరాలు త్వరలో చెబుతాము''అన్నారు . సమర్పణ: పరుచూరి ప్రసాద్‌.

English summary

 Allu Arjun is currently so busy that he couldn't give dates to Gopichand until next year. Gopichand on the other hand has delivered a super hit with Balupu and has been waiting to start his next film for more than eight months. He couldn't wait for another year sitting idle and Gopichand decided to make the same movie with Ram as the subject he has developed suits any young actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu