»   » ఈ గ్యాప్ లో సమ్మర్ వెకేషన్ కు ...అల్లు అర్జున్

ఈ గ్యాప్ లో సమ్మర్ వెకేషన్ కు ...అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా సన్నాఫ్ సత్యమూర్తితో హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ లోగా ఆయన తన సమ్మర్ వెకేషన్ ని పూర్తి చేసుకుని వచ్చేయాలనుకుని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సమ్మర్ ని లండన్ లో గడపనున్నారని తెలుస్తోంది. అక్కడ నుంచి రాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

బోయపాటి చిత్రం విశేషాలకి వస్తే...

అల్లు అర్జున్, సింహా దర్శకుడు బోయపాటి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి టైటిల్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అది మరేదో కాదు... ‘రథం'. అయితే ఈ టైటిల్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం రవితేజతో గతంలో చేసిన భధ్ర తరహాలో యాక్షన్‌తో కూడిన ప్రేమకథ చిత్రంగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక సన్నాఫ్ సత్యమూర్తితో మంచి హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. నిన్నటితో ఈ అనుమానాలు తొలగిపోయాయి. రీసెంట్ గా బోయపాటి జన్మదిన వేడుకను గీతా ఆర్ట్స్ ఆఫీసులో నిర్వహించారు.

దాంతో ఈ సినిమా ఉంటుందని హింట్ వచ్చింది. ఇప్పటికే కథ చర్చలు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని మే రెండో వారంలో ప్రారంభించనున్నారట. హైవోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Allu Arjun to have summer vacation

హిందీలో పాపులర్ అయిన టీవీ నటి సోనారికా ఈ చిత్రంలో హరోయిన్ గా చేసే అవకాశం ఉంది. సోనారిక ప్రస్తుతం తెలుగులో నాగ శౌర్య సరసన ‘జాదూగాడు' చిత్రంలో నటిస్తోంది. ఇదే ఆమె తొలి సినిమా. అందం, పర్ ఫెక్ట్ ఫిజిక్, యాక్టింగ్ టాలెంట్ ఉండటంతో బోయపాటి దృష్టిలో పడింది. అల్లు అర్జున్ కూడా ఆమెను ఓకే చేసినట్లు టాక్.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ .. అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం చేయాల‌ని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. బోయ‌పాటి శ్రీను చెప్పిన క‌థ నాకు, బ‌న్ని కి బాగా న‌చ్చి మా బ్యాన‌ర్ గీతాఆర్ట్స్ లో చేస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వుంటూ ప్యూర్ ల‌వ్ స్టోరి మిక్స్ అయిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామని తెలిపారు.

బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.. బ‌న్ని తో సినిమా ఎప్పుడో చేయాల్సింది. బ‌న్ని బాడీ లాంగ్వేజ్ కి స‌రిపోయో క‌రెక్ట్ క‌థ సిధ్ధంచేశాను. అర‌వింద్ గారు, బ‌న్ని ఈ క‌థ విని వెంట‌నే ఓకే చేశారు. ప‌క్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వున్న స్టోరి, హీరోయిజం వుంటూనే ల‌వ్ స్టోరి వుంటుంది. ఈచిత్రం లో కొత్త బ‌న్ని క‌న‌ప‌డ‌తాడనేది ఖ‌చ్చితంగా చెప్పగల‌ను అన్నారు.

English summary
Allu Arjun will be flying to London for summer vacation and once he returns back, Boyapati Srinu film's regular shoot will commence.
Please Wait while comments are loading...