»   » అల్లు అర్జున్ వలనే క్రిష్ ను చూసి వెటకారంగా మాట్లాడుకొన్నారట!?

అల్లు అర్జున్ వలనే క్రిష్ ను చూసి వెటకారంగా మాట్లాడుకొన్నారట!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ హీరోకైనా కథ చెప్పాలంటే ఒక్కసారి చెప్పడంతో సరిపోదు..అంతా బాగానే వుంది కానీ అక్కడ కొంచెం మార్చు..ఇక్కడ కూడా కొంచెం చేంజ్ చెయ్యి అని డైరెక్టర్ ని ముప్పతిప్పలు పెడతారు ఇప్పటి హీరోల్లో కొందరు. కానీ డైరెక్టర్ క్రిష్ కి ఆ అనుభవం ఎదురు కాలేదు. కథ చెప్పిన సింగిల్ సిట్టింగ్ లో క్రిష్ కి అల్లు అర్జున్ తన డేట్స్ ని మనస్సూర్తిగా ఇచ్చేశారట.

సింగిల్ సిట్టింగ్ లోనే అల్లు అర్జున్ డేట్స్ తీసుకున్నానని తన తండ్రి జాగర్లమూరి సాయిబాబాకి క్రిష్ చెప్పడంతో..తమాషా చేయకు హీరోగా మంచి ఫామ్ లో వున్న అల్లు అర్జున్ నీకు డేట్స్ ఇవ్వడమేంటి అసలు తనను కలిసావా? అని ఎదురు ప్రశ్సిస్తూ నవ్వాడట. ఈ విషయం తెలుసుకున్న వారంతా వెటకారంగా క్రిష్ గురించి మాట్లాడుకోవండం, క్రిష్ మాత్రం వారి మాటల్ని పక్కన పెట్టి తన కథని డెవలెప్ చేసుకొని అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రదారులుగా 'వేదం" చిత్రాన్ని ప్రారంభించడంతో అందరూ క్రిష్ ని చూసి ముక్కుమీద వేలేసుకున్నారట. ఈ చిత్రం జూన్ 4న విడుదలవబోతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu