»   »  త్రివిక్రమ్ అండతో అల్లు అర్జున్ కొత్త స్కిల్ ప్రదర్శన

త్రివిక్రమ్ అండతో అల్లు అర్జున్ కొత్త స్కిల్ ప్రదర్శన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ కెరీర్ మొదట నుంచీ చూస్తే మనకు ప్రధానంగా కనపడేది అతనిలో కష్టపడే తత్వం. ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకుంటూ, ఫిజికల్ గా ఫిట్ నెస్ గా ఉంటూ డాన్స్ లు ప్రాక్టీస్ చేస్తూ తనను నమ్మి వచ్చే ఫ్యాన్స్ కు డబ్బలు గిట్టుబాటు అయ్యేలా చేస్తూంటాడు. తాజాగా ఓ సంవత్సరం నుంచీ ఆయన జిమ్నాస్టిక్స్ ప్రాక్టీసు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు వాటిని త్రివిక్రమ్ తో తాను చేయబోయే తదుపరి చిత్రంలో ప్రదర్శించనున్నారని సమాచారం. ఈ మేరకు త్రివిక్రమ్ స్క్రిప్టులో కొన్ని మార్పులు ప్రస్తుతం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఫైట్స్ నాచురల్ గా ఉండనున్నాయని తెలుస్తుంది.

'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్‌ ...అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు పూజా కార్యక్రమాలు జరిగాయి. 'జులాయి' తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తూండటంతో అంతటా ఓ రేంజి లో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఈ నెల్లో గ్రాండ్ గా సిని పెద్దల సమక్షంలో లాంచ్ చేయటానికి నిర్మాత రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పవన్ కొత్త పార్టీ పెడుతూ జనం మధ్యకు వస్తూండటంతో త్రివిక్రమ్ ఆ వ్యవహారాల్లో పూర్తి బిజీ అయ్యిపోయారు. ఈ నేపధ్యంలో బన్నీ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

Allu Arjun Learning gymnastic Skill

రేసు గుర్రం తర్వాత గోపీచంద్ మలినేనితో పండుగ చేస్కో చిత్రం చేయటానికి స్క్రిప్టు వర్క్ జరిగింది. అయితే త్రివిక్రమ్ తో ఓకే చేయటంతో అదిప్పుడు రామ్ దగ్గరకి వెళ్లింది. అటు హరీష్ శంకర్ చిత్రమూ రిజెక్టు చేసారు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ చిత్రం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్. అయితే ఎలక్షన్స్ అయ్యేదాకా త్రివిక్రమ్ ఖాళీ పడలేదు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకొంటున్నారు.

దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్‌. మరో ప్రక్క అల్లుఅర్జున్‌ 'రేసుగుర్రం' రీసెంట్ గా రిలీజయ్యి సూపర్ హిట్టైంది.

English summary
Allu Arjun has been honing his gymnastic skills from a popular gymnast Babu for the last one year. The actor could be using his gymnastic skills in his next film with Trivikram to raise the bar on action sequences in T-town.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu