»   »  రూమర్స్‌ హల్ చల్: అల్లు అర్జున్ వివరణ

రూమర్స్‌ హల్ చల్: అల్లు అర్జున్ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కు డాన్సర్‌గా మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఆయన ‘ఎబిసిడి-2' అనే బాలీవుడ్ డాన్స్ బేస్డ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ప్రభుదేవా, వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ తదితరులు నటిస్తున్నారు.

అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. గెస్ట్ రోల్ చేయడం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం తనకు ఇష్టం లేదని, మంచి స్క్రిప్టు, పూర్తి ప్రాధాన్యం ఉన్న పాత్ర వస్తే డైరెక్టుగా బాలీవుడ్ చేయడం గురించి తప్పకుండా ఆలోచిస్తాను. ఇప్పుడైతే నేను ఏ బాలీవుడ్ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేయడం లేదన్నారు.

Allu Arjun

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాను కేరళలో ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. ఇప్పుడీ చిత్రం మళయాళ వెర్షన్ ఏప్రిల్ 24న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే మళయాళ వెర్షన్ కు చెందిన పోస్టర్స్ ,ప్రోమోలుతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యి ఉంది. బిజినెస్ కూడా బాగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ అక్కడ ఈ సినిమాకు ప్రమోషన్స్ నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అక్కడ ఓ షాపింగ్ మాల్ లో అభిమానుల సమక్షంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. మళాయలంలో అల్లు అర్జున్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఆయన గత చిత్రాలు అక్కడ కూడా విడుదలై మంచి కలెక్షన్లు సాధించాయి. అందుకే తన ప్రతి సినిమా మళయాలంలోనూ తప్పకుండా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటాడు అల్లు అర్జున్.

English summary
Allu Arjun said that he denied the Bollywood film as he was not interested to debut with a cameo in Bollywood. He further added that if he gets a right script and a full fledged role, he will surely think about signing the film.
Please Wait while comments are loading...