»   » ఫైనల్ గా బన్నీ డెసిషన్ తీసుకున్నాడట

ఫైనల్ గా బన్నీ డెసిషన్ తీసుకున్నాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చాలా కాలంగా చర్చలు జరుపుతున్న ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యినట్లే. లింగుసామి, అల్లు అర్జున్ కాంబినేషన్ ఓకే అయ్యిందని తెలుస్తోంది. ఓ భారీ బడ్జెట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సబ్జెక్టు రెడీ అయ్యిందని, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాసం ఉందని అంటున్నారు.

ఆ మధ్యన లగడపాటి శ్రీధర్ తన పుట్టినరోజు సందర్భంగా ఎనిమిదవ సినిమాగా ఈ అల్లు అర్జున్ - లింగుస్వామిల సినిమాను ప్రకటించాడు. నటుల పేర్లు బహిరంగంగా తెలపకపోయినా అతను అల్లు అర్జున్ యే తన సినిమాలో హీరో అని తగినన్ని సూచనలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు మరి లగడబాటి శ్రీదర్ చేస్తున్నారో లేదో తెలియదు.

లింగు స్వామి గత సినిమాలు ఇక్కడ విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన తాజా సినిమా టాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా మెగా అభిమానులు ఈ కాంబినేషన్‌పై చాలా ఆసక్తిగా ఉన్నారు.

ALLU ARJUN's BILINGUAL IN WORKS

లింగు స్వామి గత సినిమాలు చూస్తే....ఎంటర్టెన్మెంట్ విత్ యాక్షన్, రొమాన్స్ బ్యాక్ బ్రాప్‌తో యూత్‌కు నచ్చే విధంగా ఆయన సినిమాల శైలి ఉంటుంది. తాజాగా అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాలో కూడా అదే ఫార్ములాను ఉపయోగించి సరికొత్తగా రూపొందించాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కూడా తాను ఒకరిద్దరు తమిళ డైరెక్టర్లతో చర్చలలో ఉన్నాడని తెలిపాడు. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా తెలుపలేదు. కేరళలో తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ ను చాలామంది ఒక తమిళ సినిమాలో నటించమని కోరుతున్నారని, అందుకే ఈ కాంబినేషన్ ఓకే చేసారని అంటున్నారు. లింగుస్వామితో తీస్తున్న సినిమా ద్విభాషాచిత్రంగా రాబోతుంది.

గతంలో లింగుస్వామి ‘వెట్టాయ్', ‘పైయా' సినిమాలను తీసాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. రామ లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ మరియు శిరీష ఈ సినిమాను నిర్మిస్తారా లేదా అన్నది మాత్రం తేలాల్సి ఉంది.

English summary
Allu Arjun green signal to a big budget commercial entertainer is planned in the direction of Lingusami.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu