»   » కేటరింగ్ చేస్తూ ... అల్లు అర్జున్ ...'డీజే' లో పాత్ర అదేనట!

కేటరింగ్ చేస్తూ ... అల్లు అర్జున్ ...'డీజే' లో పాత్ర అదేనట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం' . ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరిగిపోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు లుక్ కూడా రీసెంట్ గా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఫస్టు లుక్ లో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించాడు. దాంతో 'అదుర్స్' సినిమాలో ఎన్టీఆర్ తరహా పాత్రను అల్లు అర్జున్ చేస్తున్నాడని అంతా భావించారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం... 'అదుర్స్' లో ఎన్టీఆర్ మాదిరిగా బన్నీ ఈ సినిమాలో పౌరోహిత్యం చేయడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన కేటరింగ్స్ బిజినెస్ చేసే బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందినవాడిగా కనిపిస్తాడని అంటున్నారు. ఫస్టులుక్ లో బన్నీ స్కూటర్ కి కూరగాయల సంచులు తగిలించుకుని తీసుకువస్తుండటమే అందుకు నిదర్శనం అని చెప్తున్నారు.


విజయవాడ సత్యనారాయణ పేటకు చెందిన 'అన్నపూర్ణ కేటరింగ్స్ .. ప్యూర్ వెజిటేరియన్స్' అనే కేటరింగ్ సంస్ద నడుపుతూ కథ నడుస్తూందని అంటున్నారు. కెటరర్స్ కు చెందిన ..లోగో కూడా ఈ స్కూటర్ కి ఉండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. మొత్తం మీద బన్నీ ఈ సారి మరింత డిఫరెంట్ పాత్రనే ఎంచుకున్నాడని అంటున్నారు.


Allu Arjun's DJ character revealed?

దిల్‌రాజు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... మా సంస్థ నిర్మిస్తోన్న 25వ చిత్రమిది. ఆర్య పరుగు తర్వాత బన్నీతో హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. మా బ్యానర్‌లో హరీష్‌శంకర్ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో అతనితో చక్కటి అనుబంధం ఏర్పడింది. వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.


హరీష్‌శంకర్ మాట్లాడుతూ దిల్‌రాజుగారి బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా ఇది. దిల్‌రాజుతో తన అనుబంధం 'గబ్బర్‌సింగ్‌' నుంచి కొనసాగుతుందన్నారు. 'ఆర్య' సినిమా వచ్చినప్పటి నుంచి అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని అనుకున్నా.. ఇప్పటికి ఆ కోరిక తీరిందని వెల్లడించారు. అలాగే అల్లు అర్జున్ ప్రతి సినిమాలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. దిల్‌రాజుగారి సంస్థను నా హోమ్‌బ్యానర్‌గా ఫీలవుతాను. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని హరీష్‌శంకర్ పేర్కొన్నారు.


మహాశివరాత్రి సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు. కొద్ది సేపటి క్రితమే ఫస్ట్ లుక్ విడుదల కాగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ టాపిక్ గా మారిపోయింది. ఈ చిత్రం ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మార్చి కల్లా మిగిలిన భాగాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు.


అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, సంగీతం: దేవీశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌శంకర్.

English summary
Allu Arjun, Pooja Hegde’s upcoming entertainer Duvvada Jagannadham (DJ) directed by Harish Shankar. Allu Arjun is playing the role of Vijayawada panthulu who is into the catering business. The logo on the scooter filled with vegetables with Annapurna Caterings,Satyanarayanapuram Agraharam, Vijayawada’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu