For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ ..స్పెయిన్ ట్రిప్ అసలు కారణం?

  By Srikanya
  |

  హైదరాబాద్ : రీసెంట్ గా విడుదలైన జులాయి హిట్ టాక్ తెచ్చుకోవటంతో హ్యాపీ ఫీలైన అల్లు అర్జున్ కొద్ది రోజులు రెస్ట్ కు హాలీడే ట్రిప్ కు స్పెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. వెళ్లారు. స్పెయిన్ లో ఈ హాలీడే ని ఎంజాయ్ చేసి వచ్చారు. అయితే అది పేరుకి హాలీడే ట్రిప్ అయినా లొకేషన్స్ చూడటానికి వెళ్లాడని ఫిల్మ్ నగర్ టాక్. పూరీ జగన్నాధ్ తో తాను చేయబోయే 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం షూటింగ్ అత్యధిక శాతం స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరగనుంది. నవంబరు, డిసెంబరు నెలల్లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తి చేయడానికి పూరి సన్నాహాలు చేస్తున్నారు.

  అల్లు అర్జున్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేయ బోతున్న 'ఇద్దరమ్మాయిలతో..సినిమాలో నటించే ఇద్దరు హీరోయిన్ల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. ఈ చిత్రంలో ఇదివరకే తాప్సీ ఓ హీరోయిన్‌గా ఎంపికవ్వగా మరో హీరోయిన్‌గా తాజాగా అందాల తార అమలాపాల్‌ను ఎంపికచేశారు. ఈ విషయాన్ని అమలాపాల్‌ స్వయంగా టీట్‌ చేసింది. ''డ్యాన్సింగ్‌ స్టార్‌ బన్నీ, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో కలిసి చేస్తున్న అద్భుతమైన కొత్త ప్రాజెక్టులో హీరో యిన్‌గా నేను ఎంపికయ్యాను. వారి కాంబినేష్‌కి నేనూ తోడవడం సంతోషంగా ఉంది అని ఆమె చెప్పింది. తెలుగులో నాని సరసన 'జెండాపై కపిరాజు, రాంచరణ్‌ సరసన 'నాయక్‌ సిని మాల్లో నటిస్తున్న అమలకు ఇది మరో క్రేజీ ప్రాజెక్టు. ఈ సినిమాలతో ఆమె తెలుగు అగ్ర తారల్లో ఒకరిగా చేరే అవకాశా లున్నాయి. బండ్ల గణేష్‌ నిర్మించే 'ఇద్దరమ్మాయిలతో.. సినిమా త్వరలో ప్రారంభం కానుంది.


  అల్లు అర్జున్‌ని మాస్‌లోకి చొచ్చుకువెళ్లేలా చేసిన సినిమా 'దేశముదురు'. పూరి జగన్నాథ్ మార్క్ పాత్ర చిత్రణతో అందులో అల్లు అర్జున్ పూర్తి మాసివ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందనుంది. వైవిధ్యభరితంగా టైటిల్స్ పెట్టే పూరి ఈ చిత్రం కోసం 'ఇద్దరమ్మాయిలతో' అనే టైటిల్ ఫిక్సయ్యారు. పూరి తరహా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందనుంది. పవన్‌కళ్యాన్‌తో 'గబ్బర్‌సింగ్' చేసి ప్రస్తుతం ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 'బాద్‌షా' నిర్మిస్తున్న బండ్ల గణేష్ ఈ చిత్రానికి నిర్మాత. పూరి చిత్రానికి తొలిసారిగా దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన ఇద్దరు హీరోయిన్స్ . తాప్సీ, అమలాపాల్ గా హీరోయిన్స్ గా ఎంపికయ్యారు.
  హీ
  అల్లు అర్జున్ ఇటీవలే 'జులాయి'గా తెరపైకి వచ్చారు. ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగుంది. అలాగే మళయాళంలోనూ ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. ఈ విషయమై మాట్లాడుతూ... ''నా సినిమాలు మలయాళంలోనూ ఆదరణ పొందడం సంతోషంగా ఉంది. అలాగని నేనేమీ అక్కడి హీరోలకు పోటీగా నిలుస్తున్నాను అనుకోను. నాకంటూ అక్కడో మార్కెట్‌ని ఏర్పరచుకోగలిగాను'' అన్నారు . ఇక 'జులాయి'తో మరో మెట్టు ఎక్కాను అన్నారు. ఆ మెట్టు త్రివిక్రమ్‌తో సినిమా చేయడమే... ఓ గొప్ప అనుభూతి అని వివరించారు.

  English summary
  Producer Bandla Ganesh will be busy man spending majority of the time scouting for locations and shooting spots abroad this year again after Gabbar Singh and Baadshah. Sources close to the producer say that his upcoming movie "Iddaru Ammailu" (tentatively titled) will be majorly shot in foreign locations Spain.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X