Pushpa 2 తరువాత బన్నీ ఫాన్స్ కాలరెగరేసే కాంబో.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్ నుంచి పుష్ప 2 తర్వాత ఎలాంటి సినిమా వస్తుందనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఆయన ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు కొందరు దర్శకుల దగ్గర కథలు వింటున్నానని వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఆయన ఎవరి సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తేలలేదు. కానీ తాజాగా క్రేజీగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది అది కనుక నిజమైతే బన్నీ ఫాన్స్ కాలర్ ఎగరేయడం ఖాయమని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

అద్భుతమైన విజయాన్ని సాధించి

అద్భుతమైన విజయాన్ని సాధించి

అల వైకుంఠపురములో సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేశారు. అలా పుష్ప అనే ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు అర్జున్. ఆ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2021 సంవత్సరంలో విడుదలయి అద్భుతమైన విజయాన్ని సాధించింది.

తర్వాతి సినిమా

తర్వాతి సినిమా

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు సహా దక్షిణాది భాషల కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో అల్లు అర్జున్ దృష్టంతా ఇప్పుడు పుష్ప 2 సినిమా మీదే ఉంది. పుష్ప కంటే పుష్ప 2 గ్రాండ్గా తెరకెక్కించాలని ఉద్దేశంతో నుంచి అనేక మార్పులు చేర్పులు కూడా చేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. జూలై నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.. ఈ స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉందని సుకుమార్ ఆ పనిలోనే ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తర్వాతి సినిమా గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

టాప్ ప్రొడక్షన్ హౌస్లు

టాప్ ప్రొడక్షన్ హౌస్లు

అల్లు అర్జున్ బోయపాటి శ్రీను, కొరటాల శివ వంటి వారితో సినిమాలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు సరికొత్త ప్రచారం తెరమీదకు వచ్చింది. అది ఏంటంటే చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తర్వాతి సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా గా ఉండబోతోందని ఒక్కో భాషలో ఆయా భాషల్లో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్లు భాగం అవుతాయని తెలుస్తోంది.

హాట్ టాపిక్ గా

హాట్ టాపిక్ గా

అంటే తెలుగులో గీతాఆర్ట్స్, కన్నడ విషయానికి వస్తే హోంబలే ఫిలింస్ హిందీ విషయానికి వస్తే కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ వంటి సంస్థలు ఈ సినిమాను తమ తమ భాషలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అది వీరందరూ కూడా నిర్మాణంలో భాగంగా అవుతారా లేక కేవలం విడుదల వరకే పరిమితం అవుతారా అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఈ క్రేజీ గాసిప్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

Megastar Chiranjeevi Acting School Admissions open *Entertainment | Telugu OneIndia
 క్లారిటీ రావాల్సి ఉంది

క్లారిటీ రావాల్సి ఉంది

ఇక అలాగే మరో రకమైన ప్రచారం కూడా జరుగుతోంది. అదేమిటి అంటే మురుగదాస్ కానీ అట్లీ గాని పుష్ప తరువాతి సినిమా అల్లు అర్జున్ తో చేసే అవకాశం ఉందని అంటున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం కొరటాల శివ, బోయపాటిలలో ఎవరో ఒకరితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ ఎవరిని ఫైనల్ చేస్తారు? ఏ దర్శకుడితో ఆయన ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతోంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X