»   » ఎన్టీఆర్ కాదంటే ఆగాడా!? బన్నీతో ‘నాపేరు సూర్య.. అంటున్నాడు

ఎన్టీఆర్ కాదంటే ఆగాడా!? బన్నీతో ‘నాపేరు సూర్య.. అంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గతంలో కార్తీ హీరోగా 'నాపేరు శివ'అనే టైటిల్ తో ఓ చిత్రం వచ్చి విజయవంతమైంది. కొంచెం అటూ ఇటూలో ఆ టైటిల్ ని గుర్తు చేసేలా.. ...అల్లు అర్జున్ ...తదుపరి చిత్రానికి 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. డైరక్టర్ ఎవరూ అంటారా...ఇంకెవరు..వక్కంతం వంశీ.

రచయిత వక్కంతం వంశీ త్వరలోనే మెగాఫోన్‌ పట్టబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో అనుకున్న ప్రాజెక్టు ఊహించని విధంగా ఆగిపోవటంతో ... ఇప్పుడు ఆయన బన్ని ని ఎప్రోచ్ అయ్యి . ఇప్పటికే ఓ కథ వినిపించారు. ఆ కథకి బన్నీ గ్రీన్ సిగ్నల్ తెలిసింది. అయితే అది ఎన్టీఆర్ రిజెక్టు చేసిన కధా లేక మరొకటా అనేది తెలియాల్సి ఉంది.

Allu Arjun's next movie titled Naa Peru Surya Naa Illu India

ఇక వక్కంతం వంశీ ఇచ్చిన కథతోనే రేసుగుర్రం వంటీ సూపర్ హిట్ ని అల్లు అర్జున్ కొట్టారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 'డీజే - దువ్వాడ జగన్నాథమ్‌' పూర్తవ్వగానే అల్లు అర్జున్‌ - వక్కంతం వంశీ కలయికలోనే ఓ సినిమా పట్టాలెక్కనున్నట్టు సమాచారం. లగడపాటి శ్రీధర్‌ నిర్మించనున్న ఆ చిత్రానికి 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే పేరుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

దీంతో పాటు మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నప్పటికీ, ఈ పేరు బన్నీకి బాగా నచ్చిందని ప్రచారం సాగుతోంది. ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసారు.

ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం విషయానికి వస్తే..

అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డీజే - దువ్వాడ జగన్నాథమ్‌' ఫస్ట్‌లుక్‌ని ఈ నెల 18న విడుదల చేయబోతున్నారు. ఆ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు.


''ఆర్య', 'పరుగు' తర్వాత అల్లు అర్జున్‌ మా సంస్థలో చేస్తున్న సినిమా 'డీజే - దువ్వాడ జగన్నాథమ్‌'. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు దీటుగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు హరీష్‌ శంకర్‌. ఫస్ట్‌లుక్‌ని ఈ నెల 18న, టీజర్‌ని మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నాం. ప్రస్తుతం కర్ణాకటలో చిత్రీకరణ జరుగుతోంది'' అన్నారు దిల్‌రాజు.

English summary
'Naa Peru Surya Naa Illu India' is the title that has been registered for Allu Arjun's new film. It will be directed by Vakkantam Vamsi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu