»   » లెజండ్ ఎఫెక్ట్ : 'రేసు గుర్రం' వాయిదా

లెజండ్ ఎఫెక్ట్ : 'రేసు గుర్రం' వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రేసుగుర్రం'. ఈ చిత్రం విడుదల వాయిదా పడనుందని సమాచారం. మార్చి 28 న ఈ చిత్రం రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే బాలకృష్ణ లెజండ్ సైతం అదే సమయంలో రిలీజ్ కు సన్నిధ్దమవుతోంది. దాంతో థియోటర్స్ క్లాష్ వస్తుందని ఏప్రియల్ 11 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు థియోటర్స్ కు వర్తమానం పంపినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ చిత్రంలోని పాటల్ని ఈ నెల 14న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌, సలోని హీరోయిన్స్. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), డా||కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు.

Allu Arjun's Race Gurram to release on April 11?

సురేంద్రరెడ్డి మాట్లాడుతూ..."గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు

నిర్మాతలు మాట్లాడుతూ "బన్ని కెరీర్‌లో ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉంటుంది. మా రేసుగుర్రం విశేషాలు ఇంకా తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. వినోదం, యాక్షన్‌ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి తగ్గట్టే.. హుషారుగా సాగిపోతుంది'' అని అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

English summary
Race Gurram is likely to be postponed to mid April. It seemed like a big clash between Race Gurram and Balakrishna's Legend was on the cards. However, the makers have reportedly told the distributors and theatre owners that the film is likely to release on April 11.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu