»   » హనీమూన్ కి ఫామ్ హౌస్ కావాలంటూ మోరాయిస్తున్న బన్నీ..

హనీమూన్ కి ఫామ్ హౌస్ కావాలంటూ మోరాయిస్తున్న బన్నీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ మార్చిలో పెళ్ళి చేసుకోబోతున్నాడు. స్నేహా రెడ్డి వధువుగా అల్లు అర్జున్ వరుడుగా ఈ పెళ్ళి ఎంతో ఘనంగా జరుగుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నాడు. పెళ్ళికి ముందే స్నేహారెడ్డి, అల్లు అర్జున్ కుటుంబాలు ఎంతో స్నేహాంగా ఉన్నాయని, ఇప్పుడు ఈ పెళ్లితో బంధుత్వాన్ని కలుపుకోవడం ఎంతో బాగుందని ఇరు కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడైన బన్నీ సినిమా రంగంలో ఎదురులేని యువ నటుడిగా పేరు సంపాదించాడు. పెళ్ళి ఘనంగా చేసుకొని, తర్వాత తన వైవాహిక జీవితాన్ని ఎంతో హాయిగా, ఆనందంగా గడపాలని నిశ్చయించుకున్నాడు. పెళ్ళి తరువాత హనీమూన్ ట్రిప్పును జరుపుకొని, హైదరాబాద్ లో కూడా జాలీగా గడపటానికి బన్నీ ఇప్పటినుంచే ప్లానులో ఉన్నాడు. పెళ్లి తర్వాత స్నేహా రెడ్డితో కలసి జాలీగా గడపటానికి బన్నీ ఇప్పటినుంచే ప్లానులో ఉన్నాడు. అదీ అలాంటి ఇలాంటి ప్లాన్ కాదు ఏకంగా ఫాంహౌజ్ పక్కనే లేక్ ఉండేటట్లు చూడమని తన అనుచరులతో చెప్పాడట. మరి తను అనుకున్న విధంగా ఉండే ఫామ్ హౌస్ లో బన్నీ ఎన్నో కలలు కంటున్నాడు. ప్రక్కన కొలను, దాని ప్రక్కన గెస్ట్ హౌజ్ ప్కక్కన పూలతోటలు, ఓహో బన్నీ ముందుగానే ఊహల్లో ఉన్నాడన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu