»   » డిప్రెషన్ లో అల్లు అర్జున్..వరుడు ఎఫెక్టు?

డిప్రెషన్ లో అల్లు అర్జున్..వరుడు ఎఫెక్టు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ తన తాజా చిత్రం వరుడు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో చాలా నిరాశకు లోనయ్యాడని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రముఖంగా వినపడుతోంది. ఆర్య సీక్వెల్ వర్కవుట్ కాకపోవటం, తన బర్తడే గిప్ట్ అనుకున్న ఈ వరుడు చిత్రం పూర్తిగా ఫెయిల్యూర్ అవటం అతన్ని బాగా ఇబ్బంది పెట్టిందని చెప్తున్నారు. ఎప్పుడూ ఉషారుగా తుళ్ళుతూ ఉండే అల్లు అర్జున్ ఈ వారంలో పెద్దగా ఎవరితో మాట్లాడలేదని, ఎవరి ఫోన్ కాల్స్ అటెండ్ చేయటం లేదని వినపడుతోంది. అయితే ఇదంతా డిప్రెషన్ కాదని, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రాసెస్ అనీ కొందరు వ్యాఖ్యానస్తున్నారు. అలాగే గుణశేఖర్ ని కూడా అల్లు అర్జున్ కలవటానికి నిరాకరించాడని, ఆఖరికి ఆయన ఫోన్ ని కూడా లిప్ట్ చేయటం లేదని అంటున్నారు. ప్రమేషన్ చేసి సినిమాని కొద్దిగా నిలబెట్టాలని నిర్మాతకి ఉన్నా అది జరిగేటట్లు కనపడటం లేదని చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ క్రిష్ తో వేదం చిత్రం చేస్తున్నారు. అలాగే వివి వినాయిక్ తో బద్రీనాధ్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu