»   » అల్లు అర్జున్...స్పెషల్ ట్రైనింగ్

అల్లు అర్జున్...స్పెషల్ ట్రైనింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ కెరీర్ కోసం అందరి హీరోల కన్నా కాస్త ఎక్కువే కష్టపడుతూంటారు. తన క్యారెక్టర్ డిమాండ్ మేరకు శారీరిక భాషను మార్చుకోవటం, సిక్స్ ప్యాక్ చేయటం వంటివి చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన కత్తి ఫైట్స్ నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఎందుకూ అంటే...తాను తాజాగా నటిస్తానని కమిటైన గుణశేఖర్ చారిత్రిక చిత్రం రుద్రమదేవి కోసం అని తెలుస్తోంది. ఈ మేరకు తనను తాను తీర్చుకుని, కత్తి తిప్పటంలో ప్రత్యేక ట్రైనింగ్ పొందుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అల్లు అర్జున్ మీద తీసే యాక్షన్ సన్నివేశం సినిమాకు హైలెట్ అయ్యి నిలుస్తుందని చెప్తున్నారు.

మొదటి నుంచీ అల్లు అర్జున్‌.. ఉత్సాహానికి మారు పేరు. చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమికుడిగా, బాధ్యతలు నెత్తికెత్తుకున్న యువకుడిగా, దేశముదురుగా.. ఇలా వివిధ పాత్రలతో అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇతడు చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించబోతున్నాడు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని గుణశేఖర్‌ హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ప్రకటించారు.

Allu Arjun special training for Rudhrama Devi

''కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న కథానాయకుడతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం కథానాయకులలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.

ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. ఇప్పటికే బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ పొందుతున్నాడు. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్‌ నటిస్తుంది. వీరిపై జులైలో చిత్రీకరణ జరుపుతాం'' అంటూ వివరించారు గుణశేఖర్‌. ఈ సినిమాలో అనుష్క, రానా, నిత్యమీనన్‌, కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

English summary
Allu Arjun is working on his physique as well as things like sword fight etc.He is going to play a crucial role in Gunasekhar ‘s historical film’ Rudhrama Devi ‘.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu