»   » అల్లు అర్జున్ ప్రస్తుతం సెలూన్ షాపుల్లోనే...

అల్లు అర్జున్ ప్రస్తుతం సెలూన్ షాపుల్లోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా సన్నాఫ్ సత్యమూర్తితో హిట్ కొట్టి ఉషారుగా ఉన్నాడు అల్లు అర్జున్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. స్క్రిప్టు ఫైనల్ టచెస్ జరుగుతున్నాయి. అయితే ఈ లోగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే అందుతున్న సమాచారాన్ని బట్టి ఆయన రోజులో ఎక్కువ సేపు... హైదరాబాద్ లగ్జరీ సెలూన్ షాపుల్లో గడుపుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

ఎందకయ్యా అంటే... తన తదుపరి చిత్రంలో ఆయన ఏ హెయిర్ స్టైల్ లో కనపడితే బాగుంటుందనే ఐడియా కోసమే అని చెప్పుకుంటున్నారు. లవర్ బోయ్ క్యారెక్టర్ కావటంతో ...అందుకు తగినట్లు తనను తాను కొత్తగా డిజైన్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇలా బన్ని అందరి కన్నా డిఫెరెంట్ గా కనిపించటానికి నిరంతరం ట్రై చేస్తున్నాడు కాబట్టే సక్సెస్ లు అతన్ని వెన్నంటే ఉంటున్నాయి ఏమంటారు.

మరో ప్రక్క ఈ సమ్మర్ ని లండన్ లో గడపనున్నారని తెలుస్తోంది. అక్కడ నుంచి రాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

బోయపాటి చిత్రం విశేషాలకి వస్తే...

Allu Arjun spend time at Saloons !!!

అల్లు అర్జున్, సింహా దర్శకుడు బోయపాటి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి టైటిల్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అది మరేదో కాదు... ‘రథం'. అయితే ఈ టైటిల్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం రవితేజతో గతంలో చేసిన భధ్ర తరహాలో యాక్షన్‌తో కూడిన ప్రేమకథ చిత్రంగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక సన్నాఫ్ సత్యమూర్తితో మంచి హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. నిన్నటితో ఈ అనుమానాలు తొలగిపోయాయి. రీసెంట్ గా బోయపాటి జన్మదిన వేడుకను గీతా ఆర్ట్స్ ఆఫీసులో నిర్వహించారు.

దాంతో ఈ సినిమా ఉంటుందని హింట్ వచ్చింది. ఇప్పటికే కథ చర్చలు కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని మే రెండో వారంలో ప్రారంభించనున్నారట. హైవోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Allu Arjun spend time at Saloons !!!

హిందీలో పాపులర్ అయిన టీవీ నటి సోనారికా ఈ చిత్రంలో హరోయిన్ గా చేసే అవకాశం ఉంది. సోనారిక ప్రస్తుతం తెలుగులో నాగ శౌర్య సరసన ‘జాదూగాడు' చిత్రంలో నటిస్తోంది. ఇదే ఆమె తొలి సినిమా. అందం, పర్ ఫెక్ట్ ఫిజిక్, యాక్టింగ్ టాలెంట్ ఉండటంతో బోయపాటి దృష్టిలో పడింది. అల్లు అర్జున్ కూడా ఆమెను ఓకే చేసినట్లు టాక్.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ .. అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం చేయాల‌ని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. బోయ‌పాటి శ్రీను చెప్పిన క‌థ నాకు, బ‌న్ని కి బాగా న‌చ్చి మా బ్యాన‌ర్ గీతాఆర్ట్స్ లో చేస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వుంటూ ప్యూర్ ల‌వ్ స్టోరి మిక్స్ అయిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామని తెలిపారు.

బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.. బ‌న్ని తో సినిమా ఎప్పుడో చేయాల్సింది. బ‌న్ని బాడీ లాంగ్వేజ్ కి స‌రిపోయో క‌రెక్ట్ క‌థ సిధ్ధంచేశాను. అర‌వింద్ గారు, బ‌న్ని ఈ క‌థ విని వెంట‌నే ఓకే చేశారు. ప‌క్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వున్న స్టోరి, హీరోయిజం వుంటూనే ల‌వ్ స్టోరి వుంటుంది. ఈచిత్రం లో కొత్త బ‌న్ని క‌న‌ప‌డ‌తాడనేది ఖ‌చ్చితంగా చెప్పగల‌ను అన్నారు.

English summary
Reportedly Bunny is spending time with the best stylists at some luxurious saloons of Hyderabad City such that he will get a best idea for a hair cut. This is regarding the upcoming movie of Boyapati Seenu, where he will be seen as a lover boy.
Please Wait while comments are loading...