జోరుమీదున్న స్టైలిష్ స్టార్.. సుకుమార్ కోసం రెడీ!
అల్లు అర్జున్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మెగా అభిమానుల్లో జోష్ నింపింది. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు విశేషాలు, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ ప్రాజెక్టు వివరాల కోసం ఆరా దీస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబో సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ కేరళలో పూర్తి చేసిన చిత్రయూనిట్.. ప్రస్తుతం బన్నీయేతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే 'అల.. వైకుంఠపురములో' బిజీ నుంచి బన్నీ బయటకొచ్చాడు కాబట్టి.. ఇక సుకుమార్ సెట్స్ పైకి వచ్చేస్తా అని చెప్పేశారట. ఈ మేరకు వచ్చేనెల మొదటివారం నుంచి బన్నీతో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేశారట సుకుమార్.

అల్లు అర్జున్ కెరీర్‌లో 20వ సినిమా ఈ మూవీ రూపొందుతోంది. తొలిసారి క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఆయనతో జోడీ కడుతుండటం విశేషం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. చిత్రంలో బన్నీ చిత్తూరు యాసతో మాట్లాడతారని టాక్. బన్నీ అభిమానుల టేస్ట్‌కి తగ్గట్టుగా సుక్కు ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట.
మరోవైపు 'అల వైకుంఠపురములో' సక్సెస్‌తో 2020 ఆరంభంలోనే హిట్ పట్టేయడంతో బన్నీపై క్రేజ్ డబుల్ అయింది. సంక్రాంతి కానుకగా ఆయనకి ఈ సక్సెస్ లభించడం పట్ల అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఈ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











