Just In
Don't Miss!
- News
జై హింద్, జై బంగ్లా: జై శ్రీరాం నినాదాలపై దీదీ గరం గరం, మోడీ సమక్షంలోనే ఫైర్..
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Sports
అతడికి అవకాశాలు ఇవ్వనప్పుడు.. ఎందుకు రిటైన్ చేసుకోవాలి: కేకేఆర్‌పై గంభీర్ ఫైర్
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శర్వానంద్ కోసం కాకినాడకు అల్లు అర్జున్, త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా..?
విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. మెగాస్టార్ చిరంజీవితో థమ్సప్ యాడ్‌లో కనిపించి, తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శర్వానంద్.. మొదట్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు.
ఆ తర్వాత హీరోగా పరిచయం అయ్యాడు. కెరీర్ తొలినాళ్లలో పలు ఫ్లాప్స్ పలకరించినా.. ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత కొన్ని హిట్స్ రావడంతో శర్వానంద్ స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. 'పడిపడి లేచె మనసు' ఫ్లాప్ తర్వాత మరికొన్ని సినిమాలకు సంతకాలు చేసేశాడు.

ఈ యంగ్ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం 'రణరంగం'. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అతడు గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాకు గురించి ఓ ఆసక్తికరం విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కాకినాడలో చేయబోతున్నారట. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ వస్తున్నారనేదే ఆ వార్త సారాంశం. శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'పడిపడి లేచె మనసు' ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ వచ్చాడు. అయితే, ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇందులో నటీనటుల పనితీరుకు చక్కని మార్కులే పడినప్పటికీ కన్విన్సింగ్‌గా లేని కథ వల్ల సినిమా నిరాశ పరిచింది.