»   » వరుడు ప్రొడ్యూసర్ ని ముప్పతిప్పలు పెడుతున్న అల్లు అర్జున్

వరుడు ప్రొడ్యూసర్ ని ముప్పతిప్పలు పెడుతున్న అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశముదురుతో హిట్టిచ్చాడని అల్లు అర్జున్ హీరోగా మరో సినిమా తీసిన డివివి దానయ్యకి ఆ సినిమాతో సరదా తీరిపోయింది. వరుడు చిత్రంతో భారీ ఫ్లాప్ చవిచూసిన దానయ్య ఇంతదాకా ఆ దెబ్బ నుంచి కోలుకోనేలేదు. అయితే వరుడుతో జరిగిన నష్టానికి బాధ్యత వహించి మరో సినిమా తక్కువకే చేసిపెడతానని అతనికి బన్నీ మాటిచ్చాడు. అలా త్రివిక్రమ్ దర్శకత్వంలో దానయ్య ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాడు. దర్శకుడి విషయంలో ఎన్నో తర్జనభర్జనలు పడిని అల్లు అర్జున్ ఈ సినిమా ఎప్పుడు మొదలు పెట్టేదీ చెప్పకుండా కొంతకాలం సాగదీశాడు. ఎట్టకేలకు నీ సినిమానే ముందు చేస్తానంటూ తేల్చి చెప్పినా కానీ దానిని మొదలుపెట్టడానికి అల్లు అర్జున్ తాత్సారం చెస్తున్నాడు.

ఇక సినిమా మొదలు పెట్టడమే ఆలస్యం అనుకుంటూ ఉండగా, సర్జరీ పేరు చెప్పి కొన్ని నెలలు షూటింగ్ చేయనని చల్లగా చెప్పాడు. ఇప్పటికే అడ్వాన్సులు రూపంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్, ఇలియానాలకి కొన్ని కోట్లు ముట్టజెప్పిన దానయ్య అదంతా ఫైనాన్స్ లోనే తెచ్చాడు. ఇప్పుడు వాటికి వడ్డీ తడిసి మోపెడవుతోంది. కానీ అల్లు అర్జున్ మాత్రం దానయ్య మీద ఏమాత్రం జాలి చూపించకపోగా, వరుడు తర్వాత మరో సినిమా చేయడానికి అంగీకరించడమే పెద్ద గిప్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడట.

English summary
Allu Arjun has okayed a new film. The film is his first after his marriage. Trivikram Srinivas will direct the film. The film will be produced by Danaiah who made films like Desamuduru and Varudu. The new film will go on to the sets after two months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu